సత్తాచాటిన ‘అనంత’
– సాఫ్ట్‌బాల్ పోటీల్లో ముందజలో జిల్లా క్రీడాకారులు
– రసవత్తరంగా సాగుతున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి 62 సాఫ్ట్‌బాల్ పోటీల్లో అనంత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ఆదివారం జరిగిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో వివిధ విభాగాల్లో అనంత క్రీడాకారులు తరువాతి రౌండ్‌లకు అర్హత సాధించారు. ముందుగా పోటీలు జరుగుతున్న నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో సాఫ్ట్‌బాల్ క్రీడా కోచ్‌లు, నిర్వాహకులు, స్టేట్ అబ్జర్వర్లతో జిల్లా స్కూల్‌గేమ్స్ అధ్యక్షుడు అంజయ్య సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాఫ్ట్‌బాల్ పోటీలు జరుగుతున్న తీరును కార్యదర్శి నారాయణను అడిగి తెలుసుకున్నారు. ఇక.. ఉదయం జరిగిన మ్యాచ్‌లను కూడా అంజయ్య ప్రారంభించారు.
సెమీస్‌కు చేరిన అనంత బాలుర జట్లు
రెండోరోజు సాఫ్ట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి. అండర్–14 క్వార్టర్స్ మ్యాచులో అనంత జట్టు నెల్లూరు జట్టును 10–0తో ఓడించి, సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచులో అనంత క్రీడాకారుడు మహబూబ్‌బాషా –1 హోమర్ షాట్‌తో అలరించాడు. అండర్–17 క్వార్టర్స్‌లో అనంత జట్టు వైఎస్సార్ కడప జట్టును 12–1తో చిత్తు చేసింది. అనంత జట్టులో రాకేష్‌కుమార్–1, శివకుమార్–1 హోమర్ షాట్లు కొట్టి జట్టు విజయానికి దోహద పడ్దారు.
క్వార్టర్స్ విజేతలు వీరే
అండర్–17 బాలుర విభాగంలో వైఎస్సార్ జిల్లా జట్టును అనంత జట్టు 12–1తో ఓడించింది. చిత్తూరును విజయనగరం జట్టు 6–0 తో ఓడించింది.
అండర్–14 విజేతలు వీరే
తూర్పుగోదావరి జట్టును గుంటూరు జట్టు 9–0తో ఓడించింది. నెల్లూరును అనంత జట్టు 10–0తో ఓడించింది. వైఎస్సార్ జిల్లాను విజయనగరం జట్టు 15–2తో ఓడించింది. పశ్చిమగోదావరి జట్టును శ్రీకాకుళం జట్టు 8–1తో ఓడించింది.
లీగ్ విజేతలు వీరే..
అండర్–14 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జట్టును అనంత జట్టు 7–1తో ఓడించింది. వైఎస్సార్ జిల్లా జట్టును కష్ణ జట్టు 6–4తో ఓడించింది. నెల్లూరును విజయనగరం జట్టు 10–1తో ఓడించింది. చిత్తూరును కర్నూలు జట్టు 29–28తో ఓడించింది. విశాఖను విజయనగరం జట్టు 8–1తో ఓడించింది. నెల్లూరును విశాఖ జట్టు 10–4తో ఓడించింది.
అండర్–17 బాలికలు
పశ్చిమగోదావరి జట్టును వైఎస్సార్ జిల్లా జట్టు 10–0తో ఓడించింది. నెల్లూరును ప్రకాశం జట్టు 9–3తో ఓడించింది. శ్రీకాకుళంను ప్రకాశం జట్టు 3–2తో ఓడించింది. తూర్పుగోదావరి జట్టును విజయనగరం జట్టు 7–0తో ఓడించింది. గుంటూరును చిత్తూరు జట్టు 19–4తో ఓడించింది. పశ్చిమగోదావరి జట్టును విశాఖ జట్టు 11–0తో ఓడించింది.
అండర్–17 బాలురు
ప్రకాశం జట్టును అనంత జట్టు 2–0తో ఓడించింది. కష్ణను విజయనగరం జట్టు 5–0తో ఓడించింది. విశాఖను నెల్లూరు జట్టు 2–0తో ఓడించింది.