కందుకూరు రూరల్, న్యూస్‌లైన్ : సాఫ్ట్‌బాల్ పోటీల్లో నేషనల్ స్థాయిలో ఆడేందుకు కందుకూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని గూడూరు జ్యోతి ఎంపికైంది. గత నెల 26వ తేదీన మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాల నుంచి నలుగురు ఎంపికకాగా వారిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన జ్యోతిని జాతీయ స్థాయిలో ఆడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసినట్లు పీఈటీలు మంగతాయారు, హజీరాబేగం తెలిపారు. ఈ నెల 5వ తేదీన చండీగఢ్‌లో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో జ్యోతి పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. నేషనల్‌కు ఎంపికైన జ్యోతిని ప్రధానోపాధ్యాయురాలు వి.అరుణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.