క్రీడలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట
క్రీడలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద పీట
Published Sat, Sep 10 2016 8:14 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM
నల్లగొండ టూటౌన్: అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర మూడవ సాఫ్ట్‌బాల్ సీనియర్స్ పురుషులు, మహిళా విభాగాల్లో నిర్వహించిన పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో ఆడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా మరోసారి పట్టుదలతో రాణిస్తే గెలుపు సాధ్యమవుతుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. ఒలంపిక్ పతకం సాధించి పీవీ.సింధును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంతకుముందు క్రీడా జెండాను ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. టోర్నమెంట్ నిర్వహణ కమిటి కన్వీనర్ దుబ్బాక నర్సింహరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, మిర్యాలగూడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, డీఎస్‌డీఓ మక్బూల్ అహ్మద్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు జి.వసంత్‌కుమార్, కె. జైపాల్‌రెడ్డి, కె.శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె. సురేష్‌రెడ్డి, ఎం.నాగిరెడ్డి, టోర్నమెంట్ కోకన్వీనర్లు కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, మార్త యాదగిరిరెడ్డి, తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కుంభం నర్సిరెడ్డి, ఎస్‌జిఎఫ్ జిల్లా కార్యదర్శి జె.పుల్లయ్య పాల్గొన్నారు.
విజేతల వివరాలు
మహిళా విభాగంలో...
నల్లగొండలో సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ జట్టుపై 2–12 పాయింట్లతో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఆదిలాబాద్ జట్టుపై 0–13తో మెదక్, నల్లగొండపై 0–20తో ఆదిలాబాద్, కరీంనగర్‌పై 0–14తో నిజామాబాద్, కరీంనగర్‌పై 0–10తో హైదరాబాద్, నల్లగొండ జట్టుపై 0–10 పాయింట్ల తేడాతో నిజామాబాద్ జట్టు విజయం సాధించింది.
పురుషుల విభాగంలో...
సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జట్టుపై 0–16 పాయింట్లతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అదే విధంగా ఆదిలాబాద్‌పై 3–11తో కరీంనగర్, నల్లగొండపై 0–11తో హైదరాబాద్, ఆదిలాబాద్‌పై 0–10తో వరంగల్, నిజామాబాద్‌పై 5–6తో మెదక్, మహబూబ్‌నగర్‌పై 0–10తో రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జట్టుపై 0–13 పాయింట్లతో మెదక్ జట్టు విజయం సాధించాయి.
Advertisement