అనంతపురం న్యూసిటీ : ఆర్డీటీ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల శిక్షణా శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ నెల 7 నుంచి 9 వరకు కదిరిలో రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంఫియన్‌షిప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో నేర్చుకున్న మెళకువలు తూచా తప్పక పాటించాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని, అంతా సమష్టిగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి కేశవమూర్తి, పీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, కోచ్ ఓబులేసు, క్రిస్టఫర్ స్కూల్ ఛైర్మన్ మాలిణ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జట్లు ఇవే..
బాలుర జట్టు : పీ కిరణ్‌కుమార్, ఎం ఆనంద్(గుంతకల్లు), డీ షాషావలి, బీ రాము, వీ నవీన్‌కుమార్(రొద్దం), సీ లక్ష్మినారాయణ(ఆకుతోటపల్లి), బీ పృథ్వీరాజ్(ఎస్కేయూ), ఎం శివకుమార్(గుట్టూరు), బీ రాజశేఖర్, బీ షాకీర్(కణేకల్), ఎం రాకేష్‌నాయక్(పెదపప్పూరు), కే డేనియల్, కే రోహిత్(కదిరి), సీ బాలాజీ(రామగిరి), హర్షవర్ధన్,జగదీష్(అనంతపురం), బీ భానుదత్తా(రాప్తాడు.
బాలికల జట్టు : టీ లక్ష్మి(ముద్దినేనిపల్లి), జే రాధిక(అనంతపురం), బీ లావణ్య(ముదిగుబ్బ), పీ షకీల(కదిరి), కే అఖిలాబాయి(అనంతపురం), పీ మనీష(పెనుకొండ), పీ శ్రావణి(గోరంట్ల), కే జయశ్రీ(కుంటిమిద్దె), కే చంద్రిక(బత్తలపల్లి), జీ సుష్మా(పెరవళి), పీ శ్రీదేవి(పెద్దపప్పూరు), హెచ్ మాధవి(రామగిరి), ఎం ముంతాజ్(కురుగుంట), ఏ నానికుమారి(మన్నీల), పీ రాజ్యలక్ష్మి(రాప్తాడు), వై పవిత్ర(ఎస్కేయూ), అశ్రిత(అనంతపురం), పవిత్ర(ధర్మవరం).
ముగిసిన సాఫ్ట్‌బాల్ శిక్షణ
Published Wed, Apr 5 2017 11:01 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM
Advertisement
Advertisement