training complete
-
పోలీస్ క్యాడెట్లకు ముందే శిక్షణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న కేడెట్లకు ఈసారి నిర్ణీత సమయానికి ముందే శిక్షణ పూర్తి కానుంది. కరోనా దెబ్బకు సెమిస్టర్ సెలవులు లేకుండా నిరంతరాయంగా శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. లాక్డౌన్ విధించిన తరువాత క్యాడెట్లు ఇంతవరకూ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు. క్యాడెట్లు కరోనా బారిన పడకుండా దాదాపు 105 రోజులుగా అందరినీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)తోపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. ఎవరికీ ఔటింగ్ ఇవ్వడం లేదు. క్యాడెట్లను చూసేందుకు అకాడమీలోకి వారి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కూడా అనుమతించడం లేదు. మరీ అత్యవసరమైతే తప్ప బయటికి పంపడం లేదు. ఒకవేళ వెళ్లినా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో వారంతా కేవలం ఫోన్లతోనే కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఈసారి క్యాడెట్లందరికీ శిక్షణ ముందే ముగియనుందన్న వార్త కాస్త ఊరటనిస్తోంది. మొదటి సెమిస్టర్ సెలవులు రద్దు.. రాష్ట్రంలో జనవరి 18న టీఎస్‌పీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీటీసీలలో దాదాపు 17,200 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. వీరికి అప్పట్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వీలుండేది. మార్చి 8, 9వ తేదీల్లో క్యాడెట్లకు సెలవులు ఇచ్చారు. తరువాత అనుకోకుండా 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి క్యాడెట్లకు కరోనా సోకకుండా ఔటింగులు ఆపేశారు. కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు. వీరికి రెండు సెమిస్టర్లలో సిలబస్ పూర్తి అవుతుంది. మే నెలలో 4,5,6,7 తేదీల్లో తొలిసెమిస్టర్ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, బయటికి వెళితే.. కేడెట్ల ఆరోగ్యానికి ముప్పు ఉండటంతో సెలవులు రద్దు చేశారు. మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. వీరికి శిక్షణ ముగిసి పాసింగ్ ఔట్ పరేడ్ (పీవోపీ) అక్టోబరు 12న జరగాలి. సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వలేదు కాబట్టి పీవోపీ మరో వారం ముందుకు జరిగి అక్టోబరు 4 లేదా 5వ తేదీల్లో జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. జ్వరం, జలుబుతో పలువురు.. అకాడమీల్లో పలువురు క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారు. నగరంలోని యూ సుఫ్‌గూడలో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుల్ క్యాడెట్లు 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరంతా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా వీరిని ప్రత్యేక బ్యారెక్‌లలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు టీఎస్‌పీఏలోనూ 50 మందికిపైగా క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది. టీఎస్‌పీఏలో కరోనా అనుమానితులకు గోల్గొండ, సరోజినీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయిస్తున్నారు. -
ముగిసిన సాఫ్ట్‌బాల్ శిక్షణ
అనంతపురం న్యూసిటీ : ఆర్డీటీ స్టేడియంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా జట్ల శిక్షణా శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ నెల 7 నుంచి 9 వరకు కదిరిలో రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంఫియన్‌షిప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు సాఫ్ట్‌బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిబిరంలో నేర్చుకున్న మెళకువలు తూచా తప్పక పాటించాలన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపితే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని, అంతా సమష్టిగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి కేశవమూర్తి, పీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, కోచ్ ఓబులేసు, క్రిస్టఫర్ స్కూల్ ఛైర్మన్ మాలిణ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా జట్లు ఇవే.. బాలుర జట్టు : పీ కిరణ్‌కుమార్, ఎం ఆనంద్(గుంతకల్లు), డీ షాషావలి, బీ రాము, వీ నవీన్‌కుమార్(రొద్దం), సీ లక్ష్మినారాయణ(ఆకుతోటపల్లి), బీ పృథ్వీరాజ్(ఎస్కేయూ), ఎం శివకుమార్(గుట్టూరు), బీ రాజశేఖర్, బీ షాకీర్(కణేకల్), ఎం రాకేష్‌నాయక్(పెదపప్పూరు), కే డేనియల్, కే రోహిత్(కదిరి), సీ బాలాజీ(రామగిరి), హర్షవర్ధన్,జగదీష్(అనంతపురం), బీ భానుదత్తా(రాప్తాడు. బాలికల జట్టు : టీ లక్ష్మి(ముద్దినేనిపల్లి), జే రాధిక(అనంతపురం), బీ లావణ్య(ముదిగుబ్బ), పీ షకీల(కదిరి), కే అఖిలాబాయి(అనంతపురం), పీ మనీష(పెనుకొండ), పీ శ్రావణి(గోరంట్ల), కే జయశ్రీ(కుంటిమిద్దె), కే చంద్రిక(బత్తలపల్లి), జీ సుష్మా(పెరవళి), పీ శ్రీదేవి(పెద్దపప్పూరు), హెచ్ మాధవి(రామగిరి), ఎం ముంతాజ్(కురుగుంట), ఏ నానికుమారి(మన్నీల), పీ రాజ్యలక్ష్మి(రాప్తాడు), వై పవిత్ర(ఎస్కేయూ), అశ్రిత(అనంతపురం), పవిత్ర(ధర్మవరం). -
ముగిసిన బాస్కెట్‌బాల్ శిక్షణ
ధర్మవరం అర్బన్ : బాస్కెట్‌బాల్ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని కాకతీయ విద్యానికేతన్ ఉన్నతపాఠశాల వ్యవస్థాపకుడు మేడాపురం రామిరెడ్డి, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు శెట్టిపి జయచంద్రారెడ్డి, హిదయ్‌తుల్లాలు పేర్కొన్నారు. ధర్మవరంలోని కాకతీయ విద్యానికేతన్‌లో ఐదురోజులుగా స్పెయిన్‌కు చెందిన బాస్కెట్‌బాల్ కోచ్‌లు విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్పెయిన్ కోచ్‌లో బాస్కెట్‌బాల్ క్రీడలో మంచి శిక్షణ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కాకతీయ విద్యానికేతన్ కరస్పాండెంట్ నిర్మలా జయచంద్రారెడ్డి, డైరెక్టర్లు సూర్యప్రకాష్‌రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.