ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలి
ఉత్తమ క్రీడాకారులను తయారు చేయాలి
Published Mon, Sep 12 2016 10:24 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM
నల్లగొండ టూటౌన్: దేశం గర్వేపడేలా తెలంగాణ రాష్ట్రంలో క్రీడాకారులను తయారు చేయాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. స్థానిక ఏన్‌జీ కళాశాలలో జరిగిన మూడో తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళల సాఫ్ట్‌బాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించి వారికి వెన్నంటి వుంటుందన్నారు. సోమవారం జరిగిన ఫైనల్ మహిళా విభాగంలో హైదరాబాద్ ప్రథమ, రంగారెడ్డి, నిజామాబాద్ తృతీయ బహుమతి సాధించాయి. అదేవిధంగా పురుషుల విభాగంలో రంగారెడ్డి ప్రథమ, హైదరాబాద్ ద్వితీయ, వరంగల్ తృతీయ బహుమతి సాధించాయి. గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, వ్యాయామ ఉపాధ్యాయులకు షీల్డ్, మెమెుంటోలు అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సురేష్‌రెడ్డి, ఎం.నాగిరెడ్డి, జయపాల్‌రెడ్డి, కోకన్వీనర్ కసిరెడ్డి శేఖర్‌రెడ్డి, నిర్వాహకుడు మార్త యాదగిరిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి జె.పుల్లయ్య, ఉస్మాన్, రాజశేఖర్‌రెడ్డి, ధర్మేందర్‌రెడ్డి, శంభు, జి. శ్రీనివాస్, ఆనంద్ ఉన్నారు.
Advertisement