నల్లగొండలో సాఫ్ట్‌బాల్ పోటీలు
నల్లగొండలో సాఫ్ట్‌బాల్ పోటీలు
Published Sun, Sep 11 2016 8:31 PM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM
నల్లగొండ టూటౌన్: స్థానిక ఎన్‌జీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి మూడో సీనియర్స్ పురుషుల, మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు రెండో రోజైన ఆదివారం వివిధ జిల్లాల జట్ల మధ్య హోరాహోరీగా సాగాయి. టూ టౌన్ ఎస్‌ఐ నాగదుర్గ ప్రసాద్ క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న మహిళల ఫైనల్ పోటీలో హైదరాబాద్ – రంగారెడ్డి జట్లు తలపడనున్నాయి. అదే విధంగా పురుషుల ఫైనల్ కూడా హైదరాబాద్ – రంగారెడ్డి జట్ల మధ్యే జరుగనుంది. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సురేష్‌రెడ్డి, ఎం.నాగిరెడ్డి, కె.శేఖర్‌రెడ్డి, కె.నర్సిరెడ్డి, వీరేశం, ఉస్మాన్ పాల్గొన్నారు.
విజేతలు వీరే
పురుషుల విభాగం...
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో నల్లగొండ జట్టుపై 1–12 పాయింట్ల తేడాతో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. అదే విధంగా మెదక్‌పై 4–7తో వరంగల్, రంగారెడ్డిపై 0–3తో హైదరాబాద్, కరీంనగర్‌పై 0–9తో వరంగల్, వరంగల్‌పై 1–5తో రంగారెడ్డి జట్లు విజయం సాధించాయి. నిజామాబాద్‌పై 11–8తో రంగారెడ్డి, ఆదిలాబాద్‌పై 0–12తో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌పై 0–13తో మెదక్, కరీంనగర్‌పై 0–8తో హైదరాబాద్, మెదక్ జట్టుపై 0–5 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది.
మహిళా విభాగం...
సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్ జట్టుపై 0–7 పాయింట్లతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అదే విధంగా వరంగల్‌పై 1–11తో నిజామాబాద్, ఆదిలాబాద్‌పై 0–10తో రంగారెడ్డి, కరీంనగర్‌పై 0–10తో హైదరాబాద్, నల్లగొండపై 0–10తో నిజామాబాద్, ఆదిలాబాద్‌పై 0–13తో మెదక్, రంగారెడ్డిపై 4–5తో హైదరాబాద్, మెదక్‌పై 0–5తో నిజామాబాద్, నిజామాబాద్‌పై 2–7తో హైదరాబాద్, నిజామాబాద్ జట్టుపై 0–12 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టు విజయం సాధించాయి.
Advertisement
Advertisement