tournaments
-
నేనింతే... టీకా తీసుకోను.. అవసరమైతే..
లండన్: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ వ్యాక్సినేషన్‌పై తన కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టీకా తీసుకునే ప్రసక్తేలేదని, ఇది తప్పనిసరంటే ఏ మూల్యం చెల్లించుకునేందుకైనా సిద్ధమేనని, గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు దూరమైనా సరేనని ‘బీబీసీ’ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఇంకా జొకోవిచ్ ఏమన్నాడంటే... ‘వ్యాక్సినేషన్‌పై స్వేచ్ఛ ఉండాల్సిందే. నా శరీరానికి ఏది అవసరమో అందరికంటే నాకే బాగా తెలుసు. కోవిడ్ వ్యాక్సిన్‌పై నాకు పూర్తి అవగాహన ఉంది. నా వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించే నేను టీకా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణ యం వల్ల కలిగే పర్యావసనాలు తెలుసు. దీనివల్ల ఎన్నో టోర్నీలకు దూరంకావోచ్చు. అయినా సరే నా నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ఇలా ఏ టోర్నీకి అనుమతించకపోయినా, ఆడనివ్వకపోయినా సరే అన్నింటికి సిద్ధం. నా శరీరం కోసం నేను తీసుకునే నిర్ణయం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ఏ టైటిల్ ఎక్కువా కాదు. అయితే చాలామంది నేను వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకినని భావిస్తున్నారు. ఇది సరికాదు. టీకా వద్దనే హక్కూ సదరు వ్యక్తికి ఉండాలని అంటున్నాను తప్ప టీకా వ్యతిరేకిని కాదు. అలాంటి ఉద్యమానికి మద్దతివ్వలేదు. మాట్లాడిందీ లేదు’ అని జొకోవిచ్ వివరించాడు. -
తిరుపతిలో సీఎం కప్ పోటీలు ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి
-
సింధు విజ్ఞప్తికి ‘సాయ్’ ఓకే
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వెంట వ్యక్తిగత కోచ్, ఫిజియోలను అనుమతిస్తూ భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల సింధు వచ్చే జనవరిలో తాజాగా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెల విదేశాల్లో జరగనున్న మూడు టోర్నీల కోసం తన వెంట వ్యక్తిగత సిబ్బందిని అనుమతించాలని ఆమె ‘సాయ్’ని కోరగా... శుక్రవారం దీనిపై సానుకూలంగా స్పందించింది. ‘థాయ్‌లాండ్‌లో జనవరి 12 నుంచి 17 వరకు, 19 నుంచి 24 వరకు జరిగే రెండు టోర్నీలతో పాటు అక్కడే జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ (27 నుంచి 31) పోటీల్లో సింధుతో పాటు అక్కడికి వెళ్లేందుకు కోచ్, ఫిజియోలను ప్రభుత్వం అనుమతించింది. దీనికి సంబంధించి ఈ ముగ్గురికి అయ్యే వ్యయాన్ని సుమారు రూ.8 లక్షల 25 వేలుగా అంచనా వేసి మంజూరు చేసింది’ అని ‘సాయ్’ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనాతో పలు టోర్నీలు వాయిదా పడగా అక్టోబర్‌లో ఒక్క డెన్మార్క్ ఓపెన్ జరిగింది. కానీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది. ఈ ఏడాది ఆమె ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ (మార్చి) తర్వాత మళ్లీ బరిలోకే దిగలేదు. ప్రస్తుతం సింధు లండన్‌లోని గ్యాటోరెడ్ స్పోర్ట్స్ సైన్స్ ఇన్స్టిట్యూట్లో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ రెబెకా రాన్డెల్తో కలిసి వచ్చే సీజన్‌కు సిద్ధమవుతోంది. లండన్‌లోని జాతీయ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు టోబీ పెంటీ, రాజీవ్ ఉసెఫ్లతో కలసి సాధన చేస్తోంది. -
హైదరాబాద్ అత్తాపూర్‌లో ఘనంగా కుస్తీ పోటీలు
-
బతుకమ్మ పోటీలను విజయవంతం చేయాలి
కలెక్టర్ చేతుల మీదుగా అమ్మా గౌరమ్మ కరపత్రం ఆవిష్కరణ అక్టోబర్ 3న ప్రారంభం ఖిలావరంగల్ : సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 3న వరంగల్ స్టేష¯ŒSరోడ్డులోని మహేశ్వరి గార్డె¯ŒSలో నిర్వహించే అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట, పాటల సంబరాల పోటీలను విజయవంతం చేయాలని గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కలెక్టర్ వాకాటి కరుణ చాంబర్లో అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట,పాటల పోటీల కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలం గాణలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ మహిళలందరూ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం సకల కళా సాంస్కృతిక మండలి గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నలుమూలల చాటేందుకు అక్టోబర్ 3న బతుకమ్మ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లూరి యోగానంద్, సిద్దం రాజు, ఆరెల్లి రవి, గడ్డం సుధాకర్, ఆరూరి కుమార్, యాదగిరి, పోలెపాక సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ పోటీలను విజయవంతం చేయాలి
కలెక్టర్ చేతుల మీదుగా అమ్మా గౌరమ్మ కరపత్రం ఆవిష్కరణ అక్టోబర్ 3న ప్రారంభం ఖిలావరంగల్ : సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 3న వరంగల్ స్టేష¯ŒSరోడ్డులోని మహేశ్వరి గార్డె¯ŒSలో నిర్వహించే అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట, పాటల సంబరాల పోటీలను విజయవంతం చేయాలని గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కలెక్టర్ వాకాటి కరుణ చాంబర్లో అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట,పాటల పోటీల కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలం గాణలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ మహిళలందరూ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం సకల కళా సాంస్కృతిక మండలి గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నలుమూలల చాటేందుకు అక్టోబర్ 3న బతుకమ్మ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లూరి యోగానంద్, సిద్దం రాజు, ఆరెల్లి రవి, గడ్డం సుధాకర్, ఆరూరి కుమార్, యాదగిరి, పోలెపాక సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
భువనగిరి టౌన్ : అక్టోబర్ 4, 5వ తేదీల్లో మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీల కోసం నల్లగొండ జిల్లా జట్లను బుధవారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అండర్ 19 యూజీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గవ్వ దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ 150 మంది విద్యార్థులు హాజరు కాగా పోటీలు నిర్వహించినట్లు ప్రతిభకనబర్చిన వారిని ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో పీడీ సోమనర్సయ్య, నాగిరెడ్డి, సాంబశివుడు, పీఈటీలు పాల్గొన్నారు. ఖోఖో బాలుర జట్టు : పి.మధు, టి.సాయికుమార్, జె.ప్రశాత్, డి.నర్సింహ, డి.వెంకటేశ్వర్లు, వి.శ్రీకాంత్, ఇ.సురేష్, కె.ప్రవీణ్, పి.శ్రీకాంత్, ఎం.సంతోష్, సిహెచ్ గణేష్, ఎల్.శ్యామ్, డి.మల్లేష్, కే.దినేష్. ఖోఖో బాలికల జట్టు : వి.హేమలత, ఆర్.నవనీత, మమత, సుకన్య, కవిత, భువనేశ్వరి, దివ్యా, మనీషా, శ్యామల, పావని, సౌజన్య, రేణుక, సుషన, కౌసల్య, స్వర్ణలత ఎంపికయ్యారు. సాఫ్ట్‌బాల్ బాలుర : కె.శివ, కె.మహేష్, కె.నరేష్, ఏ.రాజేష్‌కుమార్, జి.భానుప్రసాద్, ఎస్కే.అక్బర్, జి.వెంకటేష్, పి.జలేంధర్, బి.దినేష్, సోమూ, నవీన్, బి.సిద్ధులు, డి.రాజ్, టి.నరేష్, కె.ప్రదీప్. సాఫ్ట్‌బాల్ బాలికలు : రేవతి, ప్రవళిక, ప్రశాతి, సాయివర్షణి, రేణుక, స్వాతి, శ్రావతి, శశివర్షణి, వెన్నల, ఆర్షియాజబీన్, శిరీషా, భర్గవి, అనిత, మనీషా, భార్గవి, సిద్ధూ. బేస్‌బాల్ బాలుర : ఎ.శ్రీకాంత్, కె.రమేష్, బి.రామ్, పి.ఈశ్వర్, ఎన్.నవీన్, వి.నిఖిత్కుమార్, జి.రాఖేష్, బి.సంతోష్, టి.మహేష్, జి. సురేష్, జి.హరిప్రసాద్, పి.జీవన్, అనంతాచారి, నవీన్ ఎంపికయ్యారు. -
నల్లగొండలో సాఫ్ట్‌బాల్ పోటీలు
నల్లగొండ టూటౌన్: స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి మూడో సీనియర్స్ పురుషుల, మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు రెండో రోజైన ఆదివారం వివిధ జిల్లాల జట్ల మధ్య హోరాహోరీగా సాగాయి. టూ టౌన్ ఎస్ఐ నాగదుర్గ ప్రసాద్ క్రీడాకారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం జరగనున్న మహిళల ఫైనల్ పోటీలో హైదరాబాద్ – రంగారెడ్డి జట్లు తలపడనున్నాయి. అదే విధంగా పురుషుల ఫైనల్ కూడా హైదరాబాద్ – రంగారెడ్డి జట్ల మధ్యే జరుగనుంది. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.శోభన్‌బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సురేష్‌రెడ్డి, ఎం.నాగిరెడ్డి, కె.శేఖర్‌రెడ్డి, కె.నర్సిరెడ్డి, వీరేశం, ఉస్మాన్ పాల్గొన్నారు. విజేతలు వీరే పురుషుల విభాగం... రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో నల్లగొండ జట్టుపై 1–12 పాయింట్ల తేడాతో కరీంనగర్ జట్టు విజయం సాధించింది. అదే విధంగా మెదక్‌పై 4–7తో వరంగల్, రంగారెడ్డిపై 0–3తో హైదరాబాద్, కరీంనగర్‌పై 0–9తో వరంగల్, వరంగల్‌పై 1–5తో రంగారెడ్డి జట్లు విజయం సాధించాయి. నిజామాబాద్‌పై 11–8తో రంగారెడ్డి, ఆదిలాబాద్‌పై 0–12తో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌పై 0–13తో మెదక్, కరీంనగర్‌పై 0–8తో హైదరాబాద్, మెదక్ జట్టుపై 0–5 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. మహిళా విభాగం... సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో వరంగల్ జట్టుపై 0–7 పాయింట్లతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అదే విధంగా వరంగల్‌పై 1–11తో నిజామాబాద్, ఆదిలాబాద్‌పై 0–10తో రంగారెడ్డి, కరీంనగర్‌పై 0–10తో హైదరాబాద్, నల్లగొండపై 0–10తో నిజామాబాద్, ఆదిలాబాద్‌పై 0–13తో మెదక్, రంగారెడ్డిపై 4–5తో హైదరాబాద్, మెదక్‌పై 0–5తో నిజామాబాద్, నిజామాబాద్‌పై 2–7తో హైదరాబాద్, నిజామాబాద్ జట్టుపై 0–12 పాయింట్ల తేడాతో రంగారెడ్డి జట్టు విజయం సాధించాయి. -
రేపు జిల్లాస్థాయి క్రీడాపోటీలు
నల్లగొండ టూటౌన్ : భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జయంతి పురస్కరించుకొని జాతీయ క్రీడాదినోత్సవంలో భాగంగా ఈ నెల 29న నల్లగొండలో జిల్లాస్థాయి క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ ఎండీ.మక్బూల్‌అహ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురుషులకు అథ్లెటిక్స్ (100, 800 మీటర్లు), లాంగ్‌జంప్, 19 సంవత్సరాల్లోపు బాలబాలికలకు హాకీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు జిల్లా క్రీడాభివద్ధి అధికారి వద్ద 29వ తేదీ ఉదయం 9గంటలకు పేరు నమోదు చేసుకోవాలని.. పూర్తి వివరాలకు సెల్ : 9866317321 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
నల్లగొండ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐబీసీ చానల్, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శని, ఆదివారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్ శుక్రవారం విలేకరులతో తెలిపారు. అంతకుముందు ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.