- కలెక్టర్ చేతుల మీదుగా అమ్మా గౌరమ్మ కరపత్రం ఆవిష్కరణ
- అక్టోబర్ 3న ప్రారంభం
బతుకమ్మ పోటీలను విజయవంతం చేయాలి
Published Sun, Sep 25 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
ఖిలావరంగల్ : సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ 3న వరంగల్ స్టేష¯ŒSరోడ్డులోని మహేశ్వరి గార్డె¯ŒSలో నిర్వహించే అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట, పాటల సంబరాల పోటీలను విజయవంతం చేయాలని గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కలెక్టర్ వాకాటి కరుణ చాంబర్‌లో అమ్మా గౌరమ్మ బతుకమ్మ ఆట,పాటల పోటీల కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలం గాణలో అతిపెద్ద పండుగగా బతుకమ్మ అని అన్నారు. తెలంగాణ మహిళలందరూ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం సకల కళా సాంస్కృతిక మండలి గౌరవ ఆధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నలుమూలల చాటేందుకు అక్టోబర్ 3న బతుకమ్మ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మహిళలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కొల్లూరి యోగానంద్, సిద్దం రాజు, ఆరెల్లి రవి, గడ్డం సుధాకర్, ఆరూరి కుమార్, యాదగిరి, పోలెపాక సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement