నేటి నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
Published Sat, Aug 27 2016 12:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐబీసీ చానల్, ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో శని, ఆదివారాల్లో జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐబీసీ ఎండీ ఏచూరి భాస్కర్ శుక్రవారం విలేకరులతో తెలిపారు. అంతకుముందు ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు బి.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement