సెమీఫైనల్లో హైదరాబాద్ జట్లు | hyderbad teams entered semis in soft ball championship | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో హైదరాబాద్ జట్లు

Published Mon, Jul 18 2016 10:41 AM | Last Updated on Mon, Oct 22 2018 8:11 PM

సెమీఫైనల్లో హైదరాబాద్ జట్లు - Sakshi

సెమీఫైనల్లో హైదరాబాద్ జట్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బాలబాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన బాలుర విభాగంలో పోటీల్లో హైదరాబాద్ 3-1తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 13-0తో కరీంనగర్‌పై గెలుపొందాయి.

 

మిగతా మ్యాచ్‌ల్లో మహబూబ్‌నగర్ 8-2తో నిజామాబాద్‌పై, వరంగల్ 10-0తో కరీంనగర్‌పై, మెదక్ 6-5తో రంగారెడ్డిపై, నిజామాబాద్ 10-0తో నల్లగొండపై, మహబూబ్‌నగర్ 6-5తో మెదక్‌పై గెలిచాయి. బాలికల మ్యాచ్‌ల్లో హైదరాబాద్ 9-4తో నిజామాబాద్‌పై, మెదక్ 13-12తో వరంగల్‌పై, రంగారెడ్డి 4-3తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్ 10-0తో నల్లగొండపై, నల్లగొండ 13-9తో ఆదిలాబాద్‌పై, హైదరాబాద్ 12-4తో వరంగల్‌పై విజయం సాధించాయి. నేడు (సోమవారం) సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement