హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లు
– సాఫ్ట్‌బాల్‌లో గుంతకల్లు.. క్రికెట్‌లో శ్రీసత్యసాయి జట్ల విజయం
గుంతకల్లు టౌన్ : ఏడీజేసీఏఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడామైదానంలో మంగళవారం జరిగిన పలు క్రీడల ఫైనల్ మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగాయి. సాఫ్ట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి(అనంతపురం) పై ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్టు 4–2 రన్స్ తేడాతో విజయం సాధించింది.
– క్రికెట్ ఫైనల్స్‌లో శ్రీసత్యసాయి(అనంతపురం), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(గుంతకల్లు) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుంతకల్లు జట్టు నిర్ణీత 8 ఓవర్లలో కేవలం 36 పరుగులే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీ సత్యసాయి జట్టులోని ఓపెనర్లు కేవలం 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు.
– షటిల్ ఫైనల్ మ్యాచ్‌లో ఎల్‌ఆర్‌జీ(హిందూపురం), శ్రీసత్యసాయి(అనంతపురం) జట్లు తలపడ్డాయి. ఇందులో ఎల్‌ఆర్‌జీ జట్టు విజయం సాధించి విన్నర్స్‌గా నిలిచింది.
– బాల్‌బ్యాడ్మింటన్ ఫైనల్‌మ్యాచ్‌లో శ్రీసత్యసాయి(అనంతపురం) జట్టుపై కేఎస్‌ఆర్(అనంతపురం) జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది.
– హ్యాండ్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు అథ్లెటిక్స్ పోటీలు బుధవారం జరుగుతాయని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఏడీజేసీసీ జిల్లా కార్యదర్శి నాగార్జున ప్రసాద్ తెలిపారు.