
సిడ్నీ: ఆస్ట్రేలియా అండర్ 19 మహిళా క్రికెట్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడటానికి సన్నద్ధమవుతోంది. మరో రెండు నెలల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు రాబోతున్న ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు.. సఫారీ, ఇంగ్లండ్ జట్లతో ట్రై సిరీస్‌లో తలపడనుంది.దాంతో 15 ఏళ్ల విరామానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు ఫుల్‌స్టాప్ పెట్టనుంది. చివరిసారి 2003లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో తలపడగా, ఆపై ఇంతకాలాని 'తొలి అంతర్జాతీయ మ్యాచ్'ను ఆడటానికి ఆసీస్ అండర్ 19 మహిళా జట్టు సన్నద్ధమైంది. మరొకవైపు ఆసీస్ అండర్ 19 మహిళలకు ఇదే తొలి విదేశీ పర్యటన కావడం ఇక్కడ విశేషం.
ఇందులో 50 ఓవర్ల ట్రై సిరీస్‌తో పాటు, రెండు టీ 20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టు పాల్గొనుంది. ఈ మేరకు 14 మంది మహిళా క్రికెటర్లతో కూడిన ఆసీస్ జట్టును ప్రకటించారు. ఆసీస్ అండర్ 19 మహిళా వన్డే క్రికెట్ కెప్టెన్‌గా 16 ఏళ్ల రాచెల్ ట్రెనామన్‌ను ఎంపిక చేయగా, టీ 20 జట్టుకు సారథిగా సస్కియా హార్లీని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment