హోరాహోరీగా క్రికెట్ పోటీలు
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
Published Thu, Aug 4 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
వెంకటగిరి : పట్టణంలోని తారక రామా క్రీడాప్రాంగణంలో గురువారం జరిగిన అండర్ –19 అంతర్ జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. గురువారం కర్నూలు, కృష్ణా జట్లు మధ్య జరిగిన పోటీల్లో కృష్ణా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 43 ఓవర్లకు 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లల్లో ఆరు వికెట్లు నష్టానికి 202 పరుగులు చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్నూలు జట్టు కంటే కృష్ణా జిల్లా జట్టు 86 పరుగుల ఆధిక్యత సాధించింది. శుక్రవారం మ్యాచ్ కొనసాగనుంది.
తూర్పుగోదావరి, ప్రకాశం జట్లు మధ్య జరిగిన పోటీలో తూర్పుగోదావరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 39.2 ఓవర్లల్లో 82 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం జట్టు ఆటముగిసే సమయానికి 46 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 146 పరుగులు చేసింది. శుక్రవారం ఆట కొనసాగించనున్నారు.
Advertisement
Advertisement