గుంటూరుపై కృష్ణా జట్టు విజయం
వెంకటగిరి: పట్టణంలోని తారకరామా క్రీడాప్రాంగణంలో జరుగుతున్న అండర్–19 అంతర జిల్లాల ప్లేట్ క్రికెట్ మ్యా^Œ ల్లో రెండో రోజైన బుధవారం గుంటూరుపై కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. గుంటూరు–కృష్ణా జిల్లా జట్ల మధ్యన జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో గుంటూరు జట్టు 29.1 ఓవర్లకు 78 పరుగులు చేసి ఆలౌట్ కాగా, కృష్ణా జిల్లా జట్టు ఆట ముగిసే సమయానికి 54.5 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. బుధవారం మ్యాచ్‌ను కొనసాగించి మొత్తం 375 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 45.3 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కృష్ణా జట్టు 157 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.
కొనసాగుతున్న వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల పోరు
వైఎస్సార్ కడప– పశ్చిమగోదావరి జట్ల మధ్యన పోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన తొలిరోజు మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు 63 ఓవర్లలో 177 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వైఎస్సార్ కడప జట్టు ఆటముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. బుధవారం ఆటను కొనసాగించి మొత్తం 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్ ప్రారంభించిన పశ్చిమగోదావరి జట్టు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. గురువారం ఆట కొనసాగనుంది.