![Team India Cricketer Tilak Varma Launched Disabled T20 Cricket Tourney](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/tilak.jpg.webp?itok=lejHZP0t)
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్‌సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.
తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్‌ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment