
సూరత్: హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ భారత అండర్–19 జట్టులోకి ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో భారత యువ జట్టు పర్యటించనుంది. ఉత్తరప్రదేశ్ ఆటగాడు ప్రియమ్ గార్గ్ నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఆ పర్యటనలో టీమిండియా ముక్కోణపు టోర్నమెంట్‌లో ఆడనుంది. ఆతిథ్య ఇంగ్లండ్‌తోపాటు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఆ టోర్నీలో పాల్గొంటాయి. జూలై 21న మొదలయ్యే ఈ టోర్నీలో ఆడేందుకు భారత జట్టు జూలై 15న ఇంగ్లండ్‌కు బయలుదేరుతుంది.
భారత అండర్–19 జట్టు: ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఠాకూర్ తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, ధ్రువ్ చంద్ జురెల్ (వికెట్ కీపర్), శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోయ్, విద్యాధర్ పాటిల్, సుశాంత్ మిశ్రా, రసిక్ సలామ్, సమీర్ రిజ్వీ, ప్రజ్నేశ్ కాన్పిలెవర్, కమ్రాన్ ఇక్బాల్, ప్రియేశ్ పటేల్ (వికెట్ కీపర్), కరణ్ లాల్, పూర్ణాంక్ త్యాగి, అన్షుల్ ఖంబోజ్.
Comments
Please login to add a commentAdd a comment