
డర్బన్: మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత యువ జట్టు అండర్–19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో మంగళవారం జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 120 పరుగులతో ఘనవిజయం సాధించింది. వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచిన భారత్ ఆరు పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్ రెండేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా దక్షిణాఫ్రికా ఈనెల 9న భారత్‌తో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.
జింబాబ్వే, న్యూజిలాండ్ మూడో స్థానం కోసం తలపడతాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓపెనర్ తిలక్ వర్మ (59; 8 ఫోర్లు, సిక్స్), సిద్ధేశ్ వీర్ (71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అనంతరం 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. సుశాంత్ మిశ్రా (3/35), అథర్వ (3/16), విద్యాధర్ పాటిల్ (2/31) న్యూజిలాండ్‌ను దెబ్బతీశారు.
Comments
Please login to add a commentAdd a comment