అండర్‌–19 క్రీడా జట్ల ఎంపిక | under 19 sports teams elect | Sakshi
Sakshi News home page

అండర్‌–19 క్రీడా జట్ల ఎంపిక

Published Thu, Feb 16 2017 10:21 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అండర్‌–19 క్రీడా జట్ల ఎంపిక - Sakshi

అండర్‌–19 క్రీడా జట్ల ఎంపిక

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 18 నుంచి 20 వరకు నిర్వహించే జిల్లాస్థాయి క్రీడా పోటీలకు మండలస్థాయి అండర్‌–19 క్రీడా జట్ల ఎంపికలు గురువారం స్థానిక కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్‌ క్రీడల్లో పాల్గోనే బాల, బాలికల జట్లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పీడీ శంకరన్న, పీఈటీలు వేణుగోపాల్, చంద్రశేఖర్, డీఎస్‌ఏ సిబ్బంది మనోహర్‌రెడ్డి, ఇస్మాయిల్, అనిల్, మంజుల, వాసంతి, శిరీష, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన క్రీడాకారులు
కబడ్డీలో
బాలురు : సురేష్, పృథ్వీ, కె.భరత్, మహమ్మద్‌రఫీ, సలీమ్‌మాలిక్‌ (ఎస్‌ఎస్‌బీఎన్‌), భరత్, కృష్ణ (ప్రభుత్వ పాలిటెక్నిక్‌), పవన్‌కుమార్, రాజు, షాకీర్, ఎస్‌.మహమ్మద్‌రఫీ, శర్మాస్‌వలీ(జెడ్పీ ఉన్నత పాఠశాల పాపంపేట), యశ్వంత్, పవన్‌కుమార్‌ (శ్రీ చైతన్య)
బాలికలు : లక్ష్మీ, మానస, హరిత, రాజ్యలక్ష్మీ, లత, అనిత, దివ్య, వసంత, తేజస్విణి, పావని, భారతి, వైజయంతి (కేఎస్‌ఆర్‌ అనంతపురం), వై.తేజస్విణి, శివపార్వతి(ఎస్‌ఎస్‌బీఎన్‌)
హ్యాండ్‌బాల్‌ : రవి, బాలరాజు, ఆసిఫ్, జాఫర్, అరుణ్‌కుమార్, మెహరాజ్, మహేష్‌బాబు, సన్నీ, ఆదిల్, యోగేంద్రరెడ్డి (ప్రభుత్వ ఉన్నత పాఠశాల అనంతపురం)

అథ్లెటిక్స్‌
బాలురు :
షాట్‌పుట్‌– సలీమ్‌, డిస్కస్‌త్రో–వినోద్‌, లాంగ్‌జంప్‌–అల్తాఫ్‌, 100మీ–మెహరాజ్‌, జావలిన్‌ త్రో–మహేష్‌బాబు, 400 మీ–రవి, 200మీ–లక్ష్మీనారాయణ
బాలికలు : డిస్కస్‌త్రో–సుజాత, లాంగ్‌జంప్‌–అనిత, 100 మీ–గౌతమి, జావలిన్‌త్రో–రాజ్యలక్ష్మీ, 200 మీ–భార్గవి, 400 మీ–తేజస్విణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement