సర్ఫరాజ్ వీర విహారం:భారత్దే టైటిల్ | Sarfaraz khan lead India U19s to title | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్ వీర విహారం:భారత్దే టైటిల్

Published Sun, Nov 29 2015 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

సర్ఫరాజ్ వీర విహారం:భారత్దే టైటిల్

సర్ఫరాజ్ వీర విహారం:భారత్దే టైటిల్

కోల్ కతా: అండర్-19 ముక్కోణపు క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ వీరవిహారం చేశాడు. 26 నిమిషాలు పాటు క్రీజ్ లో అజేయంగా ఉన్న సర్ఫరాజ్ 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో  బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడు. దీంతో ఆదివారం ఇరు జట్ల మధ్య జరిగిన అండర్ -19 ముక్కోణపు సిరీస్ తుదిపోరులో యువ భారత్ ఘన విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. సర్ఫరాజ్ దాటిగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లా విసిరిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


అంతకుముందు భారత్ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్ (12) నిరాశపరచగా,  రిషబ్ పాంట్(26) ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రికీ భూయి(20), సర్ఫాజ్ ఖాన్(59) లు నాటౌట్ గా క్రీజ్ లో ఉండి భారత్ కు విజయాన్నందించారు. వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పి బంగ్లాపై అద్భుతమైన గెలుపుకు సహకరించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 36.5 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటయ్యింది. బంగ్లా ఆటగాళ్లలో నజ్ముల్లా హుస్సేన్ (45)  జోయ్ రాజ్ షేక్(28),జాకెర్ అలీ(24)  మినహా ఎవరూ రాణించలేదు. ఎనిమిది మంది బంగ్లా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం.  భారత బౌలర్లలో మయాంక్ దాగర్ మూడు వికెట్లు సాధించగా, శుభం మావి, లామ్రోరర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement