ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు! | Rahul Dravid offered two year extension for India U-19 | Sakshi
Sakshi News home page

ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!

Published Tue, Jun 20 2017 4:20 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!

ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్  జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ఎటువంటి ఇంటర్వ్వూలో నిర్వహించకుండానే అతన్ని ఎంపిక చేయాలని చూస్తున్నారు.

భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement