
అండర్ 19 క్రికెటర్ అరెస్ట్
లండన్: బహిరంగ ప్రదేశాల్లో మహిళల ఎదుట అభ్యంతకరంగా ప్రవర్తించిన ఇంగ్లండ్ అండర్ -19 క్రికెటర్ శివ్ థాకూర్ను అరెస్ట్ చేశారు. ఈ జూన్ నెలలో వరుస వేర్వేరు ఘటనల్లో శివ థాకూర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు అభియోగాలు వచ్చాయి. ర్యాడ్ బోర్న్ లేన్, మ్యాక్ వర్త్ ప్రదేశాల్లో శివ్ థాకూర్ అసభ్యకర రీతిలో ప్రవర్తించినట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం ఆ యవ క్రికెటర్ ను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో డెర్బీషైర్ ఒక ప్రకటన చేసింది.'అతను మా క్లబ్ కు గతంలో ఆడిన మాట వాస్తవమే. ఇప్పుడు సదరు క్రికెటర్ తో మాకు ఎటువంటి సంబంధం లేదు. అతను మా క్లబ్ తరపును ఆడటం లేదు' అని తెలిపింది. 2014 నుంచి 2016 వరకూ సదరు యువ క్రికెటర్ డెర్బీషైర్ తరపున ఆడాడు.