
హైదరాబాద్ అండర్-19 జట్టు ప్రకటన
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న సౌత్‌జోన్ అండర్-19 ‘వినూ మన్కడ్’ ట్రోఫీలో పాల్గొనే జట్టును హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సోమవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో అక్టోబర్ 3 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ జట్టుకు మైకేల్ జైశ్వాల్ కెప్టెన్‌గా... నితీశ్ రెడ్డి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అబ్దుల్ బరీ వహాబ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.
జట్టు: మైకేల్ జైశ్వాల్, కె. నితీశ్ రెడ్డి, జి. వినీత్ రెడ్డి, ఎంఎస్‌ఆర్. చరణ్, అయూబ్, పి. సారుు వికాస్ రెడ్డి, అబ్దుల్ ఆల్ ఖురేషీ, చందన్ సహాని, టి. సంతోష్ గౌడ్, కె. భగత్ వర్మ, పి. నీలేశ్, రాజమణి ప్రసాద్, మొహమ్మద్ అజర్ అలీ (వికెట్ కీపర్), సోహైల్, అలంకృత్ అగర్వాల్, శ్రీచరణ్.