అభినవ్‌ డబుల్‌ సెంచరీ | Abhinav get Double Century | Sakshi
Sakshi News home page

అభినవ్‌ డబుల్‌ సెంచరీ

Published Tue, Jul 24 2018 10:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Abhinav get Double Century

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ లీగ్‌లో బాలాజీ కోల్ట్స్‌ బ్యాట్స్‌మన్‌ జి. అభినవ్‌ (246 బంతుల్లో 208; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. దీంతో సాయిసత్య సీసీ జట్టుతో సోమవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బాలాజీ కోల్ట్స్‌ భారీస్కోరు సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన బాలాజీ కోల్ట్స్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 8 వికెట్లకు 442 పరుగులు సాధించింది. అభినవ్‌ ద్విశతకంతో మెరవగా, ప్రథమేశ్‌ (90) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జి. గోపీకృష్ణ రెడ్డి (59), ఎ. జయచంద్ర (39) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో సూరజ్‌ సక్సేనా 4 వికెట్లు దక్కించుకున్నాడు.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు

ఎంసీసీ: 144 (భాను ప్రకాశ్‌ 91; ఎన్‌. నితిన్‌ సాయి 5/46), హైదరాబాద్‌ టైటాన్స్‌: 150/1 (రోహిత్‌ సాగర్‌ 86 నాటౌట్‌).
 ఫ్యూచర్‌స్టార్‌: 184 (ఇషాన్‌శర్మ 42; పృథ్వీ రెడ్డి 3/22, రమణ 3/60, ఇబ్రహీం ఖాన్‌ 3/28), హెచ్‌పీఎస్‌–బేగంపేట: 116 (డి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ 31; సందీప్‌ యాదవ్‌ 5/55).

 బడ్డింగ్‌ స్టార్‌: 170 (జమీరుద్దీన్‌ 44, ఫర్హాన్‌ 40; అమీర్‌ 3/43, రమావత్‌ సురేశ్‌ 5/60), అపెక్స్‌ సీసీ: 171/5 (విక్రాంత్‌ 43, నారాయణ 71; తౌసీఫ్‌ 3/43).

 డెక్కన్‌ బ్లూస్‌: 95 (రాహుల్‌ 3/15, జె. హరీశ్‌ కుమార్‌ 5/38), క్లాసిక్‌ సీసీ: 93 (సాయితేజ రెడ్డి 37, అక్షయ్‌ 6/33, దీపక్‌ 3/23).  
 విశాక సీసీ: 89 (టి. అక్షయ్‌ 31; కె. చంద్రకాంత్‌ 4/37, వి. భార్గవ్‌ ఆనంద్‌ 5/33), పోస్టల్‌: 93/1 (టి. విజయ్‌ కుమార్‌ 65).
 జై భగవతి: 195 (పి. శివ 42, మొహమ్మద్‌ సక్లాయిన్‌ 59; రోహిత్‌ గిరివర్ధన్‌ 5/65, సాత్విక్‌రెడ్డి 3/54), గౌడ్స్‌ ఎలెవన్‌:138/4 (సాత్విక్‌రెడ్డి 108).  

 కాంకర్డ్‌: 336 (వై. సాయి వరుణ్‌ 62, జి. హేమంత్‌ 58, ఆర్‌. ప్రణీత్‌ 80, టి. ఆరోన్‌ పాల్‌; వినయ్‌ 3/39, అద్నాన్‌ అహ్మద్‌ 3/100).  

 సీసీఓబీ: 367/8 (అర్షద్‌ 59, మీర్జా బేగ్‌ 136; సౌరవ్‌ 3/67, వికాస్‌ 4/103), వీనస్‌ సైబర్‌టెక్‌తో మ్యాచ్‌.  

 ఖల్సా: 181 (ఆర్యన్‌ 40; అజ్మత్‌ ఖాన్‌ 3/41, ప్రమేశ్‌ పాండే 4/22), న్యూబ్లూస్‌: 85/3 (అజిత్‌ సింగ్‌ 39, ఆర్యన్‌ సింగ్‌ 3/35).
 నేషనల్‌: 247 (మొహమ్మద్‌ ఖాలిద్‌ 87, ఎస్కే మొహమ్మద్‌ 47; నితీశ్‌ 5/70, సుమిత్‌ 3/39), ఉస్మానియాతో మ్యాచ్‌.  

 మహమూద్‌ సీసీ: 285 (హుస్సేన్‌ 92, భరత్‌రాజ్‌ 51; మొహమ్మద్‌ హష్మీ 5/76, విశాల్‌ సింగ్‌ 3/92), గ్రీన్‌టర్ఫ్‌: 13/1 (7 ఓవర్లలో).
 

రోహిత్‌ ఎలెవన్‌: 341/9 (సాత్విక్‌ భరద్వాజ్‌ 46, అర్జున్‌ చౌదరి 44, గంగా సింగ్‌ 43, అబ్దుల్‌ 50; విశేష్‌ 4/88), పాషాబీడీతో మ్యాచ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement