సంకీర్త్‌ డబుల్‌ సెంచరీ | Sankeerth gets Double Century | Sakshi
Sakshi News home page

సంకీర్త్‌ డబుల్‌ సెంచరీ

Published Thu, Jul 26 2018 10:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Sankeerth gets Double Century

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏ ఎ–1 డివిజన్‌ మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌లో కాంటినెంటల్‌ సీసీ బ్యాట్స్‌మన్‌ జి. సంకీర్త్‌ (380 బంతుల్లో 202; 34 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జెమిని ఫ్రెండ్స్‌ జట్టుతో జరుగుతోన్న ఈమ్యాచ్‌లో సంకీర్త్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటంతో కాంటినెంటల్‌ సీసీ తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరు సాధించింది. సంకీర్త్‌తో పాటు హర్‌‡్ష జున్‌జున్‌వాలా (63; 9ఫోర్లు, 1 సిక్స్‌), హృషికేశ్‌ (76; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకోవడంతో కాంటినెంటల్‌ సీసీ 9 వికెట్లకు 491 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో ఎం. రాధాకృష్ణ 3, ఎన్‌. అనిరుధ్, ఖురేషి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జెమిని ఫ్రెండ్స్‌ రెండోరోజు బుధవారం ఆటముగిసే సమయానికి 25 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 57 పరుగులతో నిలిచింది.  

ఇతర మ్యాచ్‌ల వివరాలు

 కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 174 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్‌: 129 (మల్లికార్జున్‌ 31, సర్తాజ్‌ 34; జయరామ్‌ 5/81), హైదరాబాద్‌ బాట్లింగ్‌: 337 (శ్రీ చరణ్‌ 50, సయ్యద్‌ చాంద్‌ పాషా 157; ఆశిష్‌ శ్రీవాస్తవ్‌ 4/124).

 బీడీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌: 256 (టి. సంతోష్‌ గౌడ్‌ 31; రక్షణ్‌ రెడ్డి 5/50), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌: 323/3 (చరణ్‌ 115,అక్షత్‌ రెడ్డి 114).  
 ఏఓసీ తొలి ఇన్నింగ్స్‌: 481/9 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్‌: 216/4 డిక్లేర్డ్‌ (శివం తివారి 62, సుమిత్‌ సింగ్‌ 46, అమిత్‌ పచేరా 57), ఇండియా సిమెంట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 76 ఆలౌట్‌ (త్రివేండ్ర 6/21), రెండో ఇన్నింగ్స్‌: 33/3 (13 ఓవర్లలో).

 స్పోర్టింగ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 315 (భవేశ్‌ ఖాన్‌ 74, యుధ్‌వీర్‌ సింగ్‌ 51; షేక్‌ సలీమ్‌ 3/79, భగత్‌ వర్మ 3/94), ఆర్‌. దయానంద్‌ సీసీ: 335/6 (దీపాన్‌‡్ష బుచర్‌ 104, బి. యతిన్‌ రెడ్డి 71 బ్యాటింగ్‌; తనయ్‌ త్యాగరాజన్‌ 3/128).

 జై హనుమాన్‌ తొలి ఇన్నింగ్స్‌: 512/7 డిక్లేర్డ్‌ (జి.శశిధర్‌ రెడ్డి 146, ఎన్‌. సూర్యతేజ 107, ప్రతీక్‌ రెడ్డి 82; అమోల్‌ షిండే 3/157, హితేశ్‌ యాదవ్‌ 3/151), ఆంధ్రా బ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 73/2 (రొనాల్డ్‌ రోడ్రిగ్స్‌ 36).

 ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 54/3 (మికిల్‌ జైస్వాల్‌ 40), డెక్కన్‌ క్రానికల్‌తో మ్యాచ్‌.  
 ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌: 268/5 (టి. సుమన్‌ 44, డానీ డెరెక్‌ ప్రిన్స్‌ 84, చైతన్య 51, ఆకాశ్‌ భండారి 53), ఎస్‌సీఆర్‌ఎస్‌ఏతో మ్యాచ్‌.  
 ఎంపీ కోల్ట్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 339/3 (మోహుల్‌ భౌమిక్‌ 135, ఎ. వైష్ణవ్‌ రెడ్డి 72, నిఖిలేశ్‌ సురేందరన్‌ 74), ఎన్‌స్కాన్స్‌తో మ్యాచ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement