
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment