Sheikh Rashid
-
షేక్ రషీద్ అజేయ శతకం
రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్ రషీద్ (54 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అరుణాచల్ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు. హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), కరణ్ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్ (3/10), కేవీ శశికాంత్ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 21న గుజరాత్‌తో ఆడుతుంది. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
చివరి బంతి వరకూ పోరాడుతా..
ఇస్లామాబాద్: పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(69) సంకేతాలిచ్చారు. ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అసలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను క్రీడాకారుడినని, 20 ఏళ్లపాటు క్రికెట్ ఆడానని, చివరి బంతి వరకూ పోరాడుతూనే ఉంటానని అందరికీ తెలుసని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని విమర్శించారు. భారత్–పాక్ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్ అంశమేనని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్ వ్యతిరేకంగా మారిందన్నారు. అవినీతిపరులు కావాలా? పాకిస్తాన్‌పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కొందరు పాక్ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధ్యక్షుడు షెహజాద్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో–చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, జామియత్ ఉలెమా–ఇ–ఇస్లామా నేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. కుట్రదారుల ఆటలు సాగవని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. నోరుజారిన ఇమ్రాన్ తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలో భాగంగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేవలం విదేశాల కుట్ర అని ఆరోపిస్తున్న ఆయన పొరపాటున అమెరికా పేరును బయటపెట్టారు. ఆ లేఖ కేవలం తనకు వ్యతిరేకంగా ఉందని, తన ప్రభుత్వానికి కాదని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకెక్కారు. పాక్ పార్లమెంట్ 3కు వాయిదా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) సెషన్ అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగనుంది. పాక్‌కు ఎలాంటి లేఖ పంపలేదు: అమెరికా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. జాతీయ అసెంబ్లీ రద్దుకు తెరవెనుక ముమ్మర యత్నాలు 342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో రాజీకోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు కోసం ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై అధికార తెహ్రిక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ చర్చలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవడం, అందుకు ప్రతిఫలంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లడం.. ఇదే ఈ చర్చ ఏకైక ఎజెండా అని వెల్లడించాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన పట్ల ప్రతిపక్షాలు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు ‘సేఫ్ ప్యాకేజీ’ ఇవ్వొద్దని ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో గురువారం అన్నారు. పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. -
Sheik Rashid: జగన్ సార్ నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు
సాక్షి, గుంటూరు వెస్ట్ (క్రీడలు): పేద కుటుంబంలో పుట్టి.. పోటీ ప్రపంచంలో అవరోధాలన్నీ అధిగమించి అండర్–19 భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎదిగారు గుంటూరుకు చెందిన షేక్ రషీద్. ప్రపంచ్ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించిన ఆయన ఇటీవలే గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని తన ఇంటికి వచ్చారు. బుధవారం తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రషీద్ గురువారం తన అంతరంగాన్ని ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. సాక్షి : ప్రపంచ కప్ సాధించడంలో మీ పాత్ర మరువలేనిది. దీనిపై మీ స్పందన ఏమిటీ? రషీద్: ఏ క్రికెటర్‌కు అయినా ఇది ఓ అదృష్టమే. నాలాంటి వారికి మరీ ప్రత్యేకం. ముఖ్యంగా వెస్టిండీస్ లాంటి టఫ్ వికెట్‌పై ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఆడడం అంత సులభం కాదు. సాక్షి: ప్రపంచ కప్ పోటీల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరు? రషీద్: వరల్డ్ కప్ ముందు నేను చాలెంజర్స్ ట్రోఫీ, ట్రయాంగిల్ సిరీస్ లాంటి అనేక టోర్నమెంట్లు ఆడి పెద్దపెద్ద బౌలర్లను ఎదుర్కొన్నా. దీనివల్ల వరల్డ్ కప్‌లో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ముఖ్యంగా నేను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ గురించి ఆలోచించను. ప్రతి బాల్నీ బాగా ఆడాలని అనుకుంటాను. సాక్షి : కరోనా వల్ల ప్రపంచ కప్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు కదా ఎలా ఫీలయ్యారు? రషీద్: ఇది చాలా దురదృష్టం. కరోనా బారిన పడినప్పుడు నాకు టెస్ట్ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్‌తోపాటు, ఆంధ్రా క్రికెటర్లు జ్ఞానేశ్వర్, వేణుగోపాల్, కోచ్ కృష్ణారావుతోపాటు, ఎంతో మంది రోజూ ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. ఆ స్ఫూర్తితో కోలుకున్న వెంటనే సెమీస్‌లో 94, ఫైనల్స్‌లో 50 పరుగులు చేయగలిగాను. అండగా నిలిచిన క్రికెటర్లందరికీ ధన్యవాదాలు సాక్షి: పెద్ద మొత్తం నగదు రూపంలో అందుతోంది. ఏం చేద్దామనుకుంటున్నారు? రషీద్: వరల్డ్ కప్ గెలిచిన వెంటనే బీసీసీఐ రూ.40 లక్షలు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రూ.10 లక్షలతోపాటు, మరికొంత ఇచ్చింది. ఈమొత్తాలను నా కుటుంబ సభ్యుల అవసరాలతోపాటు, భవిష్యత్తు క్రికెట్ అవసరాలకు వినియోగిస్తాను. ఈ మొత్తం నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక చేయూతను ఇచ్చిందనే చెప్పాలి. సాక్షి: ముఖ్యమంత్రిని కలవడం ఎలా అనిపించింది? రషీద్: చెప్పేందుకు మాటలు సరిపోవు. మా తండ్రి బాలీషాకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. జగన్ సార్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. నువ్వు బాగా ఆడితే జగన్ సార్ వద్దకు తీసుకెళతానని చాలా సార్లు చెప్పారు. జగన్ సార్‌ను చూడాగానే నాకు నోట మాటరాలేదు. ఆయన నా భుజంపై చేయి వేసి ఆట గురించి అడగడం, నేను చెప్పడం అన్నీ కలలాగా అయిపోయాయి. జగన్ సార్ నాకు రూ.10 లక్షల చెక్‌తోపాటు గుంటూరులోనే నివాస స్థలం, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. నా జీవితాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. సాక్షి : భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? రషీద్: మన ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడడానికి గురువారం ఉదయం కేరళ వెళుతున్నా. అక్కడ రంజీ మ్యాచ్‌లలో ఉత్తమ స్కోర్లు నమోదు చేయడంతోపాటు, మన జట్టును గెలిపించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఆ తరువాత పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాను. ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ ముఖ్యంగా మీడియాకు కృతజ్ఞతలు. సాక్షి: మీ విజయం వెనుక రహస్యం ఏమిటి? రషీద్: ఇది చెప్పడం చాలా కష్టం. నేను పదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నన్ను అక్కున చేర్చుకుని కోచ్ కృష్ణారావు ఓనమాలు నేర్పిన దగ్గర్నుంచి నా కుటుంబ సభ్యులతోపాటు, ఎందరో సహాయసహకారాలు అందించారు. 130 కోట్లు జనాభా ఉన్న మనదేశంలో భారత సీనియర్ జట్టులో స్థానం పొందే రోజుకోసం ఎదురు చూస్తున్నాను. ఈ దేశానికి ఆడడం గొప్ప అదృష్టంగా భావిస్తాను. -
టీమిండియాలో కీ ప్లేయర్ కావాలనేది లక్ష్యం: షేక్ రషీద్
-
'సచిన్ నాకు స్ఫూర్తి.. టీమిండియాలో కీ ప్లేయర్ కావాలనేది లక్ష్యం'
క్రికెట్లో తనకు స్ఫూర్తి సచిన్ టెండూల్కర్ అని, అతనిలా ఆడాలన్నదే తన కోరిక అని భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్లో కీలకం కావాలనేది తన ఆశయమని తెలిపాడు.బుధవారం సీఎంను కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం వెలుపల మీడియా పాయింట్ వద్ద రషీద్ విలేకరులతో మాట్లాడాడు. అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం పట్ల చాలా ఆనందంగా ఉందని, సీనియర్ వరల్డ్ కప్‌లో ఆడాలన్నదే తన లక్ష్యం అని తెలిపాడు. సీనియర్ ఆటగాళ్ల సలహాలు, సూచనలు పాటిస్తానన్నాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రి షేక్ బాలీషా కష్టపడుతూ తనకు అన్ని విధాలా మంచి సపోర్ట్ ఇచ్చారన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌పై అంతగా ఆలోచన లేదని, రంజీ ట్రోఫీలో బాగా ఆడాలని అనుకొంటున్నానని తెలిపాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారన్నారు. ఇంకా బాగా ఆడాలని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అంతకముందు షేక్ రషీద్‌కు ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు. -
షేక్ రషీద్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం
సాక్షి, అమరావతి: భారత క్రికెట్ అండర్ –19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను వైఎస్ జగన్ అభినందిస్తూ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. రూ.10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. షేక్ రషీద్ గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ల రషీద్.. అంతర్జాతీయ క్రికెట్లో చక్కగా రాణిస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలో, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలో ఇతను కీలకపాత్ర పోషించాడు. కాగా, రషీద్ సీఎంను కలిసిన సమయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు ఉన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీమిండియా అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ.10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేశారు. చదవండి: ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్ -
ఆంధ్రా క్రికెటర్‌కు మెగా వేలంలో మంచి ధర పలకడం ఖాయం!
అండర్-19 ఆసియా వన్డే కప్‌ను యువ భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారతదేశానికి కొత్త సంవత్సర కానుకను అందించారు. అయితే జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో భారత ఆటగాళ్లు హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్ బవా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో వీరికి బంఫర్ ఆఫర్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మగ్గురు ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం హర్నూర్ సింగ్: ఈ రైట్ హ్యాండ్ ఓపెనర్ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. అతడు 5 మ్యాచ్‌లలో ఒక సెంచరీతో పాటు 251 పరుగులు సాధించి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యూఏఈపై 120 పరుగులతో హర్నూర్ చెలరేగాడు. షేక్ రషీద్: గుంటూరుకు చెందిన షేక్ రషీద్ టోర్నెమెంట్లో అదరగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో 188 పరుగులతో రషీద్ అద్భుతంగా రాణించాడు. కాగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 90 పరగులు సాధించి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. రాజ్ అంగద్ బవా చంఢీఘడ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఆల్‌రౌండర్‌గా భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రాజ్ అంగద్ బవా 8 వికెట్లతో తీయడంతో పాటు, 110 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి, 25 పరుగులు సాధించి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చదవండి: Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి? -
Under-19 Asia Cup: గుంటూరు కుర్రాడు అదుర్స్.. ఫైనల్లో టీమిండియా
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో భారత్ 103 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో షేక్ రషీద్ (108 బంతుల్లో 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన షేర్ రషీద్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన షేక్ రషీద్ 90 పరుగుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే బౌండరీల రూపంలో వచ్చాయి. ఇక కెప్టెన్ యష్‌దుల్ 26 పరుగులు, రాజ్ భవా 23 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ 3 వికెట్లు తీయగా.. మిగతావారు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు టీమిండియా బౌలర్ల దాటికి 38.2 ఓవర్లలో 140 పరుగలుకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లలో ఆరిఫుల్ ఇస్లామ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో రాజ్‌వర్దన్, రవికుమార్, రాజ్ భవా, విక్కీ ఓస్తల్ తలా రెండు వికెట్లు తీయగా.. నిషాంత్ సింధు, కుషాల్ తంబే చెరో వికెట్ తీశారు. ఇక డిసెంబర్ 31న జరిగే ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకతో ఆడనుంది. -
U 19 World Cup 2022: మనోళ్లు ఇద్దరు.. శభాష్ రషీద్, రిషిత్ రెడ్డి!
U 19 World Cup 2022: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరిగే అండర్– 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్ర జట్టు బ్యాటర్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో రషీద్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రషీద్ ఆరు మ్యాచ్‌లు ఆడి 376 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెటర్ రిషిత్ రెడ్డి స్టాండ్‌బైగా ఉన్నాడు. రిషిత్ రెడ్డి భారత అండర్–19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), ఎస్కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బానా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్, మానవ్ పరఖ్, కౌశల్ తాంబే, ఆర్ఎస్ హంగార్గెకర్, వాసు వత్స్, విక్కీ ఒస్త్వల్, రవికుమార్, గర్వ్ సాంగ్వాన్. స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గొసాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్. చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు! Here's India's squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr — BCCI (@BCCI) December 19, 2021 -
భారత్ క్రికెట్లో మెరిసిన తెలుగు తేజం.. కీలక బాధ్యతల్లో..
ప్రత్తిపాడు/గుంటూరు: అంతర్జాతీయ క్రికెట్లో తెలుగుతేజం మెరిసింది. వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022కు బీసీసీఐ భారత్ టీంను ప్రకటించింది. పదిహేడు మంది సభ్యులతో ప్రకటించిన భారత్ టీంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా షేక్ రషీద్ ఎంపికయ్యాడు. రషీద్ మన జిల్లా వాసే. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్ నిమిత్తం వీరు ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. పన్నెండేళ్ల వయస్సులోనే.. రషీద్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్ అంటే మంచి ఇష్టమున్న రషీద్ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు సెలక్ట్ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్‌కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! -
మోదీపై విమర్శలు.. పాక్ మంత్రికి కరెంట్ షాక్!
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ అనంతరం పాక్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీపై నోరు పారేసుకుంటున్న సంగతి తెలిసిందే. పాక్ ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు నాన తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీని విమర్శించిన ఓ పాక్ మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మోదీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు సదరు మంత్రికి కరెంట్ షాక్ తగిలిందట. వివరాలు.. భారత్‌ను ఎంత ఎక్కువ విమర్శిస్తే.. అంత ఎక్కువగా పాక్ ప్రజలకు దగ్గరకు కావచ్చనే ఫార్ములాను పాటించే పాక్ రైల్వే మంత్రి రషీద్.. శుక్రవారం పాక్‌లో కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఓ ర్యాలీలో మోదీపై విమర్శలే లక్ష్యంగా పెట్టుకుని స్టేజీ మీదకు వెళ్లారు రషీద్. జనాలనుద్దేశిస్తూ.. ‘మోదీ వ్యూహం ఏమిటో మాకు తెలుసు’ అన్న కొన్ని సెకన్లలోనే అతని మైక్ షాక్ కొట్టింది. ఆ షాక్ నుంచి తేరుకున్న కొద్ది క్షణాల్లో మళ్లీ మోదీని విమర్శిచారు. ‘ఈ కరెంట్ షాక్‌తో.. మోదీ ఈ సమావేశంలో పాల్గొన్న జనాల ఆకాంక్షలను దెబ్బతీయలేరు’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు రషీద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రషీద్‌ను భారత నెటిజనులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ‘మోదీ మాట ఎత్తితేనే షాక్ తగిలింది. ఇక ఇండియాతో పెట్టుకుంటే మీ గతి ఏమిటో ఆలోచించుకో’ అంటూ కామెంట్ చేస్తున్నారు. రషీద్ రెండు రోజుల క్రితం త్వరలో ఇండియా, పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఉంటుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాక, అవసరమైతే తానే కదన రంగంలోకి దిగి పోరాడతానంటూ ఆవేశపడ్డారు. (చదవండి: అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!) -
అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం!
ఇస్లామాబాద్: అక్టోబర్ లేదా నవంబర్‌లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరగబోతోందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ బుధవారం రావల్పిండిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బహుశా, రెండు దేశాల మధ్య ఇదే తుది యుద్ధం కానుంది’ అని పేర్కొన్నారని పాకిస్తాన్ టుడే తెలిపింది. ‘భారత్‌లో ముస్లిం వ్యతిరేక భావజాలం ఉందని జిన్నా ఏనాడో చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరిగే అవకాశాలున్నాయని ఇంకా భావించే వారు మూర్ఖుల కిందే లెక్క’ అని రషీద్ వ్యాఖ్యానించారు. కశ్మీరీలకు సంఘీభావం తెలపాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ముహర్రం తర్వాత కశ్మీర్ లోయను సందర్శిస్తానన్నారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ ఈ అంశంపై అంతర్జాతీయ మద్దతు కూడగట్టే విషయంలో తీవ్రంగా విఫలమై, ఏకాకిగా మారిపోవడం తెల్సిందే. (చదవండి: భారత్‌తో అణు యుద్ధానికైనా రెడీ) -
'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే'
శ్రీనగర్: భారత్‌లో జమ్మూ కశ్మీర్ అంతర్భాగం కాదని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ రషీద్ అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజాభిప్రాయానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. రషీద్ శాసనసభకు రాజీనామా చేసి పాకిస్తాన్‌కు వలస పోవాలని లేదా వేర్పాటువాదులతో చేరాలని సూచించారు. ‘‘నన్ను జైలుకు పంపినా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించినా కశ్మీర్‌పై నా అభిప్రాయం ఇదే. చారిత్రక వాస్తవం అర్థం చేసుకోండి. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తప్ప మరో మార్గం లేదని న్యూఢిల్లీకి తెలియజేయండి ’’ అని రషీద్ సభలో అన్నారు. భారత్ సార్వభౌమత్వానికి తాను వ్యతిరేకం కాదని, భారత్-పాక్ మధ్య వివాదానికి కారణమైన జమ్మూ కశ్మీర్ గురించే మాట్లాడుతున్నానని చెప్పారు. ఐరాస తీర్మానాలను మరుగునపరిచే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొన్నారు.