
ఆంధ్రా క్రికెటర్‌కు వేలంలో మంచి ధర పలకడం ఖాయం!
అండర్-19 ఆసియా వన్డే కప్‌ను యువ భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారతదేశానికి కొత్త సంవత్సర కానుకను అందించారు. అయితే జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో భారత ఆటగాళ్లు హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్ బవా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో వీరికి బంఫర్ ఆఫర్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మగ్గురు ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం
హర్నూర్ సింగ్:
ఈ రైట్ హ్యాండ్ ఓపెనర్ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. అతడు 5 మ్యాచ్‌లలో ఒక సెంచరీతో పాటు 251 పరుగులు సాధించి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యూఏఈపై 120 పరుగులతో హర్నూర్ చెలరేగాడు.
షేక్ రషీద్:
గుంటూరుకు చెందిన షేక్ రషీద్ టోర్నెమెంట్‌లో అదరగొట్టాడు. ఈ మెగా ఈవెంట్‌లో 188 పరుగులతో రషీద్ అద్భుతంగా రాణించాడు. కాగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 90 పరగులు సాధించి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
రాజ్ అంగద్ బవా
చంఢీఘడ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఆల్‌రౌండర్‌గా భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రాజ్ అంగద్ బవా 8 వికెట్లతో తీయడంతో పాటు, 110 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి, 25 పరుగులు సాధించి అద్భుతమైన ప్రదర్శన చేశాడు.
చదవండి: Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి?