India Under-19 Cricket Team
-
సెంచరీతో అదగరొట్టిన టీమిండియా కెప్టెన్.. దక్షిణాఫ్రికా చిత్తు
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత అండర్-19 జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. జోహన్స్‌బర్గ్ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ గెలుపుతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్టోల్క్(69) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ముషీర్ ఖాన్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు నమాన్ తివారీ 3 వికెట్లు, అభిషేక్, మురగన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 48.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహ్రాన్(112) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్షు మౌలియా(76) పరుగులతో రాణించాడు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా అఫ్గానిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. -
ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌కు టీమిండియా సన్నదమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు యువ భారత జట్టు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ టీమ్స్‌తో ట్రైసిరీస్‌లో తలపడతోంది. ఈ ట్రైసిరీస్ కూడా సఫారీ గడ్డపైనే జరగుతుంది. ఈ ట్రైసిరీస్ టీమిండియా బోణీ కొట్టింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 198 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ సౌమీ పాండే 6 వికెట్లతో చెలరేగాడు. సౌమీ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి అఫ్గానిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే 6 వికెట్లు సాధించాడు. కాగా ఈ నెల 16న జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా సౌమీ భాగమయ్యాడు. రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ సోహిల్ ఖాన్(71) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హసన్ ఈసాఖిల్(54) పరుగులతో రాణించాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్శ్ సింగ్(112) సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 2న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కకర్
మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో భారత అండర్-19 కోచ్ హృషికేష్ కనిత్కకర్ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించునున్నాడు. గతేడాది కనిత్కకర్ నేతృత్వంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కాంతీకార్కు భారత సీనియర్ జట్టుతో ఇదే తొలి ప్రయాణం కావడం గమనార్హం. మరోవైపు హెడ్ కోచ్ కూడా రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా దూరం కానున్నాడు. ఇక ఈ ముగ్గురు తిరిగి ఆసియాకప్‌కు భారత జట్టుతో చేరనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. కనిత్కకర్ భారత అండర్-19 జట్టును అద్భుతంగా నడిపించాడు. అందుకే అతడిని జింబాబ్వే పర్యటనలో బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశాం. నేషనల్ క్రికెట్ అకాడమీలో కాంతీకార్తో కలిసి చాలా మంది భారత ఆటగాళ్లు కలిసి పనిచేశారు. కాంతీకార్ అనుభవం భారత సినీయర్ జట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. ఇక ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి కనిత్కకర్ పనిచేయనున్నాడు" అని పేర్కొన్నారు. ఇక జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఆగష్టు 18న మొదలు కానున్న ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చదవండి: Shikar Dhawan-Varun Dhawan: శిఖర్ ధావన్‌ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే.. -
IPL2022 Auction: ఆ ఐదుగురిపై కన్నేసిన ఐపీఎల్ జట్లు..
5 U19 Players Who Could Be In Demand At IPL 2022 Auction: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో భారత అండర్-19 జట్టు ఆటగాళ్లపై కనక వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో ముఖ్యంగా ఐదుగురు యంగ్ ఇండియా కుర్రాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయని అంచనా వేస్తున్నారు. యంగ్ ఇండియా నుంచి మొత్తం 9 మంది ఆటగాళ్లు( యశ్ ధుల్, హర్నూర్ సింగ్, కుశాల్ తాంబే, అనీశ్వర్ గౌతమ్, రాజ్ అంగద్ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, విక్కీ ఓస్వల్, వాసు వత్స్, పుష్పేంద్ర సింగ్ రాథోడ్) వేలం బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, వీరిలో జట్టు కెప్టెన్ యశ్ ధుల్, ఓపెనర్ హర్నూర్ సింగ్, ఆల్‌రౌండర్లు రాజ్ అంగద్ భవ, రాజ్‌వర్థన్ హంగార్గేకర్, స్పిన్ బౌలర్ విక్కీ ఓస్వల్ రికార్డు ధర పలకడం ఖాయమని గెస్ చేస్తున్నారు. వేలంలో షార్ట్ లిస్ట్ అయిన యంగ్ ఇండియా ఆటగాళ్లలో రాజవర్థన్ హంగార్గేకర్(30 లక్షలు) మినహా మిగిలిన 8 మంది రూ.20 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడనున్నారు. కాగా, కరీబియన్ దీవులు వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్ 2022లో యువ భారత ఆటగాళ్లు అదిరిపోయే రేంజ్లో రాణిస్తూ.. జట్టును ఎనిమిదోసారి ప్రపంచకప్ టైటిల్ రేసులో నిలబెట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 మెగా వేలం బరిలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది పేర్లు షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఇందులో 228 మంది క్యాప్డ్ ప్లేయర్లు కాగా... 355 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, ఏడుగురు అసోసియేట్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. అఫ్గనిస్తాన్ నుంచి 17, ఆస్ట్రేలియా నుంచి 47, బంగ్లాదేశ్ నుంచి 5, ఇంగ్లండ్ నుంచి 24, ఐర్లాండ్ నుంచి 5, న్యూజిలాండ్ నుంచి 24, దక్షిణాఫ్రికా నుంచి 33, శ్రీలంక నుంచి 23, వెస్టిండీస్ నుంచి 34, జింబాబ్వే నుంచి ఒకరు, నమీబియా నుంచి ముగ్గురు, నేపాల్ నుంచి ఒకరు, స్కాట్లాండ్ నుంచి ఇద్దరు, అమెరికా నుంచి ఒకరు వేలంలో పాల్గొననున్నారు. చదవండి: IND Vs WI: ఓపెనర్‌గా పంత్.. మిడిలార్డర్లో కేఎల్ రాహుల్..! -
ఆంధ్రా క్రికెటర్‌కు మెగా వేలంలో మంచి ధర పలకడం ఖాయం!
అండర్-19 ఆసియా వన్డే కప్‌ను యువ భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారతదేశానికి కొత్త సంవత్సర కానుకను అందించారు. అయితే జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో భారత ఆటగాళ్లు హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్ బవా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022 మెగా వేలంలో వీరికి బంఫర్ ఆఫర్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మగ్గురు ఆటగాళ్లపై ఫ్రాంఛైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం హర్నూర్ సింగ్: ఈ రైట్ హ్యాండ్ ఓపెనర్ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. అతడు 5 మ్యాచ్‌లలో ఒక సెంచరీతో పాటు 251 పరుగులు సాధించి టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యూఏఈపై 120 పరుగులతో హర్నూర్ చెలరేగాడు. షేక్ రషీద్: గుంటూరుకు చెందిన షేక్ రషీద్ టోర్నెమెంట్లో అదరగొట్టాడు. ఈ మెగా ఈవెంట్లో 188 పరుగులతో రషీద్ అద్భుతంగా రాణించాడు. కాగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 90 పరగులు సాధించి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. రాజ్ అంగద్ బవా చంఢీఘడ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు ఆల్‌రౌండర్‌గా భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రాజ్ అంగద్ బవా 8 వికెట్లతో తీయడంతో పాటు, 110 పరుగులు సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి, 25 పరుగులు సాధించి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. చదవండి: Ind Vs Sa 2nd Test: ప్రొటిస్‌కు అత్యధిక పరాజయాలు ఇక్కడే.. మరి ఈసారి? -
ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్‌ధుల్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 154 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టుపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 282 పరుగులు చేసింది. హర్నూర్ సింగ్ (130 బంతుల్లో 120; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ యశ్ ధుల్ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు) రాణించాడు. ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (35; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. చివర్లో రాజ్వర్ధన్ (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు; 2 సిక్స్‌లు) మెరిపించాడు. ఛేదనలో యూఏఈ 34.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. రాజ్వర్ధన్ (3/24) బంతితోనూ మెరిశాడు. గర్వ్ సాంగ్వాన్, విక్కీ, కుశాల్ తాంబే తలా రెండు వికెట్లు తీశారు. యూఏఈ ఓపెనర్ కై స్మిత్ (70 బంతుల్లో 45; 6 ఫోర్లు) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడనుంది. చదవండి: బోర్డుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.. టెస్టులు ఆడటం కష్టమే: స్టార్ ఆల్‌రౌండర్ -
U 19 World Cup 2022: మనోళ్లు ఇద్దరు.. శభాష్ రషీద్, రిషిత్ రెడ్డి!
U 19 World Cup 2022: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరిగే అండర్– 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్ర జట్టు బ్యాటర్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో రషీద్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రషీద్ ఆరు మ్యాచ్‌లు ఆడి 376 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెటర్ రిషిత్ రెడ్డి స్టాండ్‌బైగా ఉన్నాడు. రిషిత్ రెడ్డి భారత అండర్–19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), ఎస్కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బానా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్, మానవ్ పరఖ్, కౌశల్ తాంబే, ఆర్ఎస్ హంగార్గెకర్, వాసు వత్స్, విక్కీ ఒస్త్వల్, రవికుమార్, గర్వ్ సాంగ్వాన్. స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గొసాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్. చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు! Here's India's squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr — BCCI (@BCCI) December 19, 2021 -
ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు!
వచ్చే ఏడాది జనవరిలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 17 మంది ప్లేయర్లు, ఐదుగురు స్టాండ్ బై ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇక అండర్-19 ప్రపంచకప్ భారత జట్టు కెప్టెన్‌గా ఢిల్లీ ఆటగాడు యశ్ దుల్, వైస్ కెప్టెన్‌గా ఆంధ్రా ప్లేయర్ షేక్ రషీద్ ఎంపికయ్యాడు. అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన యశ్ దుల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ఎవరీ యశ్ దుల్.. న్యూఢిల్లీలోని జనక్‌పురికి చెందిన యశ్ దుల్‌కి ఢిల్లీ అండర్-16, అండర్-19, ఇండియా ‘ఎ’ అండర్-19 జట్లకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. యశ్ దుల్ 11 ఏళ్ల వయస్సులో బాల్ భవన్ స్కూల్ అకాడమీలోకి ప్రవేశించి అక్కడి నుంచే తన కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేశాడు. ఈ యువ ఆటగాడు ఇటీవల ముగిసిన వినూ మన్కడ్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడుగా ఉన్నాడు. డీడిసీఈ(ఢిల్లీ ఎండ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్) తరుపున 5 మ్యాచ్‌లు ఆడిన యశ్ దుల్ 302 పరుగులు చేశాడు. ఇక యష్ తండ్రి కాస్మెటిక్ బ్రాండ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవాడు, కానీ తన పిల్లల కెరీర్‌కోసం తన ఉద్యోగాన్ని వదులుకోవలసి వచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. "చిన్న వయస్సు నుంచే యశ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడు ఆడటానికి చిన్నతనంలోనే మంచి క్రికెట్ కిట్ నేను కొనిచ్చాను. నేను అతడికి అత్యుత్తమ ఇంగ్లీష్ విల్లో బ్యాట్లను ఇచ్చాను. యశ్ కేరిర్ కోసం మేము మా ఖర్చులను తగ్గించుకున్నాము. మా నాన్న ఆర్మీ మేన్, తనకు వచ్చిన పింఛను ఇంటి నిర్వహణకు ఉపయోగపడేది. అతడు తన కేరిర్‌లో అద్బుతంగా రాణిస్తాడని ఆశిస్తున్నాను" అని యష్ దుల్ తండ్రి పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఒడిశా ఆటగాడికి బంఫర్ ఆఫర్.. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు! -
శ్రీలంకలో వన్డే సిరిస్ గెలిచిన యువ భారత్
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ అండర్-19 యూత్ జట్టు 2-0తో గెల్చుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో లంకను యువభారత్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయింది. ఎస్ఎన్ ఖాన్ 4 కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు. 138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 32.5 ఓవర్లలో 141 పరుగులు చేసింది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో మూడు తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.