మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో భారత అండర్-19 కోచ్ హృషికేష్ కనిత్కకర్ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించునున్నాడు. గతేడాది కనిత్కకర్ నేతృత్వంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా కాంతీకార్‌కు భారత సీనియర్ జట్టుతో ఇదే తొలి ప్రయాణం కావడం గమనార్హం. మరోవైపు హెడ్ కోచ్ కూడా రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా దూరం కానున్నాడు.
ఇక ఈ ముగ్గురు తిరిగి ఆసియాకప్‌కు భారత జట్టుతో చేరనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. కనిత్కకర్ భారత అండర్-19 జట్టును అద్భుతంగా నడిపించాడు. అందుకే అతడిని జింబాబ్వే పర్యటనలో బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశాం. నేషనల్ క్రికెట్ అకాడమీలో కాంతీకార్‌తో కలిసి చాలా మంది భారత ఆటగాళ్లు కలిసి పనిచేశారు.
కాంతీకార్ అనుభవం భారత సినీయర్ జట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. ఇక ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి కనిత్కకర్ పనిచేయనున్నాడు" అని పేర్కొన్నారు. ఇక జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఆగష్టు 18న మొదలు కానున్న ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
చదవండి: Shikar Dhawan-Varun Dhawan: శిఖర్ ధావన్‌ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment