హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.
మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే
59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.
టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే
15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు.
టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే
168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు.
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.
భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్‌మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు.
ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్
135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్‌లో ఉన్నారు.
105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్‌లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.
40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా
తొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్‌లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
సికందర్ రజా వేసిన తొలి ఓవర్‌లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు.
మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.
తుది జట్లు..
జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్‌బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ
టీమిండియా: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment