IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం | IND VS ZIM 3rd T20 Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND VS ZIM: మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం

Published Wed, Jul 10 2024 4:26 PM | Last Updated on Wed, Jul 10 2024 7:58 PM

IND VS ZIM 3rd T20 Live Updates And Highlights

మూడో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్‌లో ఆధిక్యం
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరిగిన మూడో టీ20 టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్‌(27 బంతుల్లో 26; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టీ20 జులై 13న జరుగనుంది. కాగా, తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఆరో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
16.3వ ఓవర్‌: 116 పరుగుల వద్ద జింబాబ్వే ఆరో వికెట్‌ కోల్పోయింది. సుందర్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి మదండే (37) ఔటయ్యాడు. 

39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
7.6వ ఓవర్‌: 183 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 39 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 39 పరుగుల వద్ద సుందర్‌ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ రియాన్‌ పరాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి జోనాథన్‌ క్యాంప్‌బెల్‌ (1) ఔటయ్యాడు. 

37 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
6.2వ ఓవర్‌: 37 పరుగుల వద్ద జింబాబ్వే నాలుగో వికెట్‌ కోల్పోయింది. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి సికందర్‌ రజా (15) ఔటయ్యాడు. 

19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే
3.1వ ఓవర్‌: 19 పరుగుల వద్ద జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. 2.4వ ఓవర్‌లో ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో శివమ్‌ దూబేకి క్యాచ్‌ ఇచ్చి మరుమణి (13) ఔట్‌ కాగా.. 3.1వ ఓవర్‌లో ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బిష్ణోయ్‌కు క్యాచ్‌ ఇచ్చి బ్రియాన్‌ బెన్నెట్‌ (4) పెవిలియన్‌కు చేరాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన జింబాబ్వే
1.1వ ఓవర్‌: 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి మెదెవెరె (1) ఔటయ్యాడు.

జింబాబ్వే టార్గెట్‌ 183
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ 36, శుభ్‌మన్‌ గిల్‌ 66, అభిషేక్‌ శర్మ 10, రుతురాజ్‌ గైక్వాడ్‌ 49 పరుగులు చేసి ఔట్‌ కాగా.. సంజూ శాంసన్‌ (12), రింకూ సింగ్‌ (1) నాటౌట్‌గా మిగిలారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా, ముజరబాని తలో రెండు వికెట్లు పడగొట్టారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
19.4వ ఓవర్‌: 177 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో మధెవెరెకు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ (49) ఔటయ్యాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
17.5వ ఓవర్‌: 153 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్‌లో సికందర్‌ రజాకు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (66) ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
10.3వ ఓవర్‌: 81 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. సికందర్‌ రజా బౌలింగ్‌లో మరుమణికి క్యాచ్‌ ఇచ్చి అభిషేక్‌ శర్మ (10) ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
8.1వ ఓవర్‌: 67 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. సికందర్‌ రజా బౌలింగ్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి జైస్వాల్‌ (36) ఔటయ్యాడు.

హరారే వేదికగా జింబాబ్వేతో ఇవాళ (జులై 10) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. 

టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌లోని సభ్యులు యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, శివమ్‌ దూబే ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చారు. ముకేశ్‌ కుమార్‌ స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ తుది జట్టులో​కి వచ్చాడు. 

మరోవైపు జింబాబ్వే ఈ మ్యాచ్‌ కోసం రెండు మార్పులు చేసింది. ఇన్నోసెంట్‌ కాలా స్థానంలో మారుమణి.. లూక్‌ జాంగ్వే స్థానంలో నగరవ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు..
భారత్‌: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్

జింబాబ్వే: తాడివానాషే మారుమణి, వెస్లీ మాధేవేరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్‌), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్‌కీపర్‌), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement