Vikram Rathour
-
రోహిత్.. ఫోన్, ఐప్యాడ్ మర్చిపోవచ్చేమో గానీ: మాజీ కోచ్
వ్యూహాలు రచించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎవరూ సాటిరారని భారత బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. హిట్‌మ్యాన్ చిన్న చిన్న విషయాలను మర్చిపోవచ్చేమో గానీ.. గేమ్‌ప్లాన్ అమలు చేయడంలో మాత్రం పక్కాగా ఉంటాడని పేర్కొన్నాడు. జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలకు విలువనిచ్చే అతి కొద్దిమంది కెప్టెన్లలో రోహిత్ ముందు వరుసలో ఉంటాడని ప్రశంసించాడు.కాగా రోహిత్ శర్మకు మతిమరుపు ఎక్కువని అభిమానులు జోకులు వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అతడి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సరదా వ్యాఖ్యలే ఇందుకు కారణం. గతంలో ఓ షోలో కోహ్లి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు ఐపాడ్, ఫోన్, పాస్వర్డ్స్ వంటివి మర్చిపోతాడని.. అతడి వస్తువుల కోసం టీమ్ బస్ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది’’ అని తెలిపాడు.ఇందుకు తోడు అప్పుడప్పుడు టాస్ సమయంలోనూ రోహిత్ తడబాటుకు గురవటాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట ఇటీవలి కాలంలో జోకులు బాగా పేలుతున్నాయి. ఈ విషయం గురించి విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ.. ‘‘రోహిత్.. ఫోన్, ఐప్యాడ్ మర్చిపోవడం.. టాస్ సమయంలో బ్యాటింగా?, బౌలింగా?.. ఎంచుకోవడంలో తడబడటం జరుగుతుందేమో గానీ.. గేమ్‌ప్లాన్‌ను మాత్రం ఎప్పుడూ మర్చిపోడు.అతడు గొప్ప వ్యూహకర్త. అద్భుతమైన బ్యాటర్. నాకు తెలిసి.. రోహిత్ కంటే గేమ్‌ను అంతబాగా అర్థం చేసుకునే వారు మరొకరు ఉండరు. ఎలా ఆడాలన్న అంశంపై రోహిత్‌కు స్పష్టత ఉంటుంది. జట్టులోని ఆటగాళ్ల అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు.ముఖ్యంగా ఎవరి నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏమిటో.. వాటిని ఓ మ్యాచ్‌లో ఎలా ఉపయోగించుకోవాలోనన్న చర్చలకై ఎక్కువ సమయం కేటాయిస్తాడు. బౌలర్లు, బ్యాటర్ల మీటింగ్‌లో కచ్చితంగా భాగమవుతాడు. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కెప్టెన్‌గా అతడు సూపర్’’ అని రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. కాగా తరువార్ కోహ్లి పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు విక్రమ్ రాథోడ్. -
హార్దిక్, సూర్య కాదు.. ఫ్యూచర్ ఆల్ ఫార్మాట్ భారత కెప్టెన్ అతడే
తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను అతడి నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించింది.స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి టీమిండియా వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వం వహిస్తాడని రాథోర్ జోస్యం చెప్పాడు."గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్, జింబాబ్వే సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో గిల్ జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తొలిసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించినప్పటకి అతడిలో కొంచెం కూడా ఒత్తడి కన్పించలేదు. తన వ్యూహాలతో ప్రత్యర్దిని కట్టడి చేశాడు. ఇవన్నీ ఒక కెప్టెన్‌కి ఉండాల్సిన లక్షణాలే. ఇప్పుడు బీసీసీఐ అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా కూడా గిల్ మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. గిల్‌కు వైస్‌కెప్టెన్సీ బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారంటే అతడు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లే. ఇప్పుడు గిల్‌కు సీనియర్ జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం రావడంతో తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాను. అతి చిన్న వయస్సులోనే గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం గొప్ప విషయం. అతడు ఏదో ఒక రోజు కచ్చితంగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోర్ పేర్కొన్నాడు. -
NCAకు వీవీఎస్ లక్ష్మణ్ గుడ్‌బై.. కొత్త హెడ్ అతడే!
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్సీఏ హెడ్‌గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్‌తక్ పేర్కొంది.సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్‌ను ముగించారు.ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్}మరోవైపు.. 2021లో ఎన్సీఏ హెడ్‌గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.అతడి స్థానంలో ఎన్సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌తో మరోసారి మాట్లాడనున్నారు.అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్‌కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.ఐపీఎల్ మెంటార్‌గా రీ ఎంట్రీ?కాగా ఎన్సీఏ హెడ్‌గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే.. -
టెస్ట్‌ల్లోకి రింకూ..?
పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్‌పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్‌ల్లో అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రింకూకు ఉన్న టెంపర్మెంట్ సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు. రింకూ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే, అతనెందుకు టెస్ట్ జట్టులో ఉండకూడదని అనిపిస్తుందన్నాడు. రింకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటు కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా వినియోగించుకుంటే రింకూ టెస్ట్‌ల్లో సత్తా చాటగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోడ్ రింకూపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. 26 ఏళ్ల రింకూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ ఫార్మాట్లో అతను 47 మ్యాచ్‌లు ఆడి 54.70 సగటున 3173 పరుగులు చేశాడు. త్వరలో భారత్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రింకూ సింగ్ పేరును పరిశీలిస్తారేమో చూద్దాం.ఇదిలా ఉంటే, రింకూ.. భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టు కూర్పులో సమతుల్యత కోసం ప్రపంచకప్ జట్టుకు రింకూని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే ముగిసిన టీ20 సిరీస్‌లో రింకూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. ఈ సిరీస్‌లో అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రింకూ టీ20 కెరీర్లో 15 ఇన్నింగ్స్‌లు ఆడి 83.2 సగటున, 176.27 స్ట్రయిక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. రింకూ గతేడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి 55 పరుగులు చేశాడు. -
సౌతాఫ్రికాలో ఇలాంటి బ్యాటర్లే కావాలి: టీమిండియా బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
India tour of West Indies, 2023: ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో ఎల్లప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. గతంలో ఫామ్‌లేమి కారణంగా జట్టు నుంచి అతడిని తప్పించాల్సి వచ్చిది. అయితే, ఎప్పటికప్పుడు టెక్నిక్‌ను మెరుగుపరచుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. రహానే అదే పని చేస్తున్నాడు. పునరాగమనంలో భిన్నంగా కనిపిస్తున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తను రాణిస్తాడని అనుకుంటున్నాం. ముఖ్యంగా సౌతాఫ్రికా కండిషన్లలో ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతగానో ఉంటుంది’’ అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. అప్పుడు చోటే లేదు వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన పలు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు వరకు జట్టులో చోటే కరువైంది. అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడం, అదే సమయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో రహానే మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో స్థానం దక్కింది. అవకాశం సద్వినియోగం చేసుకుని వైస్ కెప్టెన్‌గా ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రహానే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ ఈ ముంబై బ్యాటర్ 89, 46 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ విఫలమయ్యాడు! జట్టులో చోటైతే ఖాయం అయితే, తొలి టెస్టులో మాత్రం రహానే పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రహానేకు చోటు ఖాయమంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా.. SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం! -
Ind Vs SA: సౌతాఫ్రికాతో కీలక పోరు.. రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా పంత్?!
T20 World Cup 2022- India vs South Africa: టీ20 ప్రపంచకప్-2022 తొలి రెండు మ్యాచ్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్. పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరిన రాహుల్.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 9 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఈ కర్ణాటక బ్యాటర్‌పై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఓపెనింగ్ జోడీపై ప్రయోగం? ఈ నేపథ్యంలో తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు ఉంటుందా? లేదా అనే సందేహాలు తలెత్తిన వేళ టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పష్టతనిచ్చాడు. సూపర్-12లో భాగంగా ఆదివారం ప్రొటిస్‌తో మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అతడికి.. భారత ఓపెనింగ్ జోడీ గురించి ప్రశ్న ఎదురైంది. రాహుల్ విఫలమవుతున్నాడు.. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రిషభ్ పంత్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇస్తారా? అని విలేకరులు ప్రశ్నించారు. బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే ఇందుకు బదులుగా.. ‘‘అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్‌లే జరిగాయి. అతడి(కేఎల్ రాహుల్) బ్యాటింగ్ బాగానే ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు’’ అంటూ ఓపెనింగ్ జోడీని మార్చే ఉద్దేశం లేదని పేర్కొన్నాడు. పెద్దగా మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగుతామని సంకేతాలు ఇచ్చాడు. ఇక టీ20లలో దూకుడుగా ఆడటం మంచిదేనన్న విక్రమ్.. అయితే పరిస్థితులకు తగ్గట్లుగా పిచ్ స్వభావాన్ని బట్టి తమ ఆటగాళ్లు ముందుకు సాగుతారని చెప్పుకొచ్చాడు. ఏదో ఒకరోజైతే ఇక జట్టులో పంత్ స్థానం గురించి స్పందిస్తూ.. ‘‘రిషభ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. తను బాగా ఆడగలడని మాకు తెలుసు. తనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. మ్యాచ్ ఆడేందుకు ఎల్లప్పుడూ మానసికంగా.. శారీరకంగా దృఢంగా ఉండాలని చెబుతున్నాం. నెట్స్‌లో తను తీవ్రంగా సాధన చేస్తున్నాడు. త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని విక్రమ్ పేర్కొన్నాడు. నిరాశలో పంత్ ఫ్యాన్స్ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ విషయంలో టీమిండియా రివ్యూకు వెళ్లి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న సంగతి తెలిసిందే. మరోవైపు.. వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఫినిషర్‌గా పునరాగమనం చేయడంతో యువ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్‌కు ఈ టోర్నీలో ఇప్పటి వరకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మాటలతో తదుపరి మ్యాచ్‌లో కూడా అతడికి అవకాశం ఉండకపోవచ్చనే సంకేతాలు వచ్చాయి. దీంతో పంత్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇదిలా ఉంటే.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా గ్రూప్-2 టాపర్‌గా ఉంది. సెమీస్‌కు వెళ్లే మార్గం సుగమం చేసుకుంటోంది. చదవండి: T20 WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’.. భారత్ నుంచి ఒక్కరికీ చోటు లేదు! T20 WC 2022: దక్షిణాఫ్రికాతో కీలక పోరు.. పెర్త్‌కు చేరుకున్న టీమిండియా -
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కకర్
మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించే భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో భారత అండర్-19 కోచ్ హృషికేష్ కనిత్కకర్ తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించునున్నాడు. గతేడాది కనిత్కకర్ నేతృత్వంలోని భారత జట్టు అండర్-19 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా కాంతీకార్కు భారత సీనియర్ జట్టుతో ఇదే తొలి ప్రయాణం కావడం గమనార్హం. మరోవైపు హెడ్ కోచ్ కూడా రాహుల్ ద్రవిడ్ కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అదే విధంగా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా దూరం కానున్నాడు. ఇక ఈ ముగ్గురు తిరిగి ఆసియాకప్‌కు భారత జట్టుతో చేరనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. కనిత్కకర్ భారత అండర్-19 జట్టును అద్భుతంగా నడిపించాడు. అందుకే అతడిని జింబాబ్వే పర్యటనలో బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశాం. నేషనల్ క్రికెట్ అకాడమీలో కాంతీకార్తో కలిసి చాలా మంది భారత ఆటగాళ్లు కలిసి పనిచేశారు. కాంతీకార్ అనుభవం భారత సినీయర్ జట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాం. ఇక ఈ సిరీస్‌కు హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి కనిత్కకర్ పనిచేయనున్నాడు" అని పేర్కొన్నారు. ఇక జింబాబ్వే పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఆగష్టు 18న మొదలు కానున్న ఈ సిరీస్‌కు కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. చదవండి: Shikar Dhawan-Varun Dhawan: శిఖర్ ధావన్‌ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే.. -
న్యాయం కోసం..
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమిళరాసన్’. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రెమిసెస్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, సోనూసూద్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించారు. పెప్సి శివ సమర్పణలో ఎస్.కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న తమిళంలో విడుదలవుతోంది. కాగా ఈ చిత్రాన్ని ‘విక్రమ్ రాథోడ్’ పేరుతో రావూరి వెంకటస్వామి అదేరోజు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.కౌసల్య రాణి, రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సత్యం, న్యాయం, ధర్మం కోసం హీరో ఎలా పోరాడాడు? అన్నది ఆసక్తిగా ఉంటుంది. ‘విక్రమ్ రాథోడ్’ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. యస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు ఆలపించిన ‘కన్నా దిగులవకు.. తొడున్నా నీ కొరకు...’ అనే పాట మా సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంది. కె.జె. యేసుదాస్గారు కూడా మా చిత్రంలో పాడడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్. -
టీమిండియా తదుపరి కోచ్ అతడేనా?
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనుండటంతో అతని వారసుడు ఎవరనే అంశంపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఈ విషయమై తాజాగా ఓ క్లారిటీ వచ్చినట్లు బీసీసీఐ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న విక్రమ్ రాథోడ్.. తదుపరి చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా బీసీసీఐ పెద్దలు సైతం రాథోడ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా టీమిండియా కోచ్ పదవి రేసులో రాహుల్ ద్రవిడ్ ముందున్నాడనే వార్తలు వినిపించినా.. అతను నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కే పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో రాథోడ్‌కు లైన్ క్లియర్ అయినట్లు బోర్డు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రవిశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మతోనూ రాథోడ్ సత్సంబంధాలు కలిగి ఉండటం అతనికి ప్లస్ పాయింట్‌గా మారింది. మరోవైపు కోచ్ పదవి రేసులో రాథోడ్ సహా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. ఏదిఏమైనప్పటికీ.. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే దాకా టీమిండియా హెడ్ కోచ్ పదవిపై సస్పెన్స్ కొనసాగనుంది. చదవండి: లార్డ్స్ టెస్ట్ మాకో గుణపాఠం.. ఇకపై వివాదాల జోలికి వెళ్లం: రూట్ -
'కోహ్లి అత్యుత్తమ ఆటగాడనేది అందుకే'
ముంబై : విరాట్ కోహ్లి.. పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటికే చాలా సార్లు కోహ్లి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మంచినీళ్లు తాగినంత సులభంగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. భారత క్రికెట్ శకంలో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగానిగా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. తన దూకుడైన ఆటతీరుతో ఎన్నో ఇన్నింగ్స్‌లు గెలిపించిన కోహ్లికి రెండో ఇన్నింగ్స్ మాట వినగానే పూనకం వచ్చేస్తుంది. అతను చేసిన సెంచరీల్లో ఎక్కువభాగం రెండో ఇన్నింగ్స్‌లో వచ్చినవే. ఒక ఆటగాడిగానే గాక టీమిండియా కెప్టెన్‌గాను సమర్థవంతంగా తన పాత్రను పోషిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఒక్కోసారి దూకుడుగా, కొన్నిసార్లు డిఫెన్స్ మోడ్ ఆడే కోహ్లి మైదానంలో ఉన్నప్పుడు అక్కడి వాతావరణాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటాడు. తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఫేస్బుక్ లైవ్ చాటింగ్‌లో మాట్లాడుతూ కోహ్లి సక్సెస్‌కు గల కారణాలను పంచుకున్నాడు. అదేంటో అతని మాటల్లోనే విందాం.. ' కోహ్లి ఏ మ్యాచ్‌నైనా నిజాయితీగా ఆడటానికే ప్రాధాన్యతనిస్తాడు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్‌గా నిలవాలనే తాపత్రయంతో చాలా కష్టపడుతుంటాడు. ఆ నిబద్ధతే ఈరోజు కోహ్లిని ఉన్నత స్థానంలో నిలిపింది. ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదని భావించే కోహ్లి బెస్ట్ ఇన్నింగ్స్ ఆడటానికే ప్రయత్నిస్తాడు. అన్నింటికంటే కోహ్లికున్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం అని ఎప్పటికి నమ్ముతా. అతను ఎప్పుడు ఒకే డైమన్షన్ ఆటతీరును ప్రదర్శించడు. పరిస్థితులను బట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేస్తాడు. ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆటశైలిని మార్చుకుంటాడు. అందుకు ఉదాహరణ.. ఐపీఎల్ 2016.. ఈ సీజన్లో కోహ్లి నాలుగు సెంచరీలు బాదాడు.. అందులో 40 సిక్సర్లు ఉన్నాయి. అంత దూకుడుగా ఆడిన కోహ్లి ఐపీఎల్ తర్వాత జరిగిన విండీస్ సిరీస్‌లో మాత్రం తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించకుండానే అక్కడ ఆడిన మొదటి మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిశాడు. అందుకే కోహ్లి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్లలో ఒకడిగా నిలిచాడు.' అంటూ రాథోర్ ప్రశంసలు కురిపించాడు.(నెపోటిజమ్ అనే మాటే లేదు: ఆకాశ్ చోప్రా) -
వరల్డ్‌కప్ జట్టును గుర్తించాం: బ్యాటింగ్ కోచ్
ఆక్లాండ్: ఈ ఏడాది జరగబోయే వరల్డ్ టీ20కి సంబంధించి ప్రతీ జట్టు తమ సన్నాహకాల్లో మునిగి తేలుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆ వరల్డ్‌కప్‌కు జట్టులో ఎలా ఉండాలనే దానిపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే వరల్డ్‌కప్ ఆడబోయే జట్టులోని సభ్యులను ఇప్పటికే గుర్తించామని అంటున్నాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. చివరి నిమిషంలో ఏమైనా ఉంటే స్పల్ప మార్పులు తప్పితే జట్టులోని సభ్యుల పేర్లను పక్కకు పెట్టామన్నాడు. ‘ వరల్డ్ టీ20కి వెళ్లే భారత జట్టులోని సభ్యులను గుర్తించాం. (ఇక్కడ చదవండి: ‘ధోని సీటును అలానే ఉంచాం’) వరుస పెట్టి సిరీస్‌లు ఆడుతూ ఉండటం వల్ల ఒక అంచనాకు వచ్చాం. వారి పేర్లను నాతో పాటు మేనేజ్మెంట్ కూడా గుర్తించింది. జట్టు ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత వచ్చింది. ఒకవేళ ఎవరైనా గాయపడినా, అప్పటికి తాము అనుకున్న ఏ క్రికెటరైనా పేలవమైన ఫామ్‌తో ఉన్నా మార్పులు ఉంటాయి. కానీ పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఇక ప్రస్తుత తరం భారత క్రికెటర్ల గురించి విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘ ఈ కొత్త జనరేషన్ క్రికెటర్ల అసాధారణమైన నైపుణ్యంతో ఉన్నారు. వారు ఫార్మాట్‌కు తగ్గట్టు వారి ప్రదర్శనతో ఆకట్టుకోవడాన్ని నేను గుర్తించా. న్యూజిలాండ్‌లో భారత క్రికెటర్ల ఆట తీరు అద్భుతంగా ఉంది’ అని పేర్కొన్నాడు. ప్రత్యేకంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లపై రాథోడ్ ప్రశంసలు కురిపించాడు. వీరి జట్టు అంచనాలకు తగ్గట్టూ ఆడుతూ విజయాల్లో పాలుపంచుకోవడం సంతృప్తిగా ఉందన్నాడు.