India tour of West Indies, 2023: ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జట్టుకు అవసరమైన సమయాల్లో ఎల్లప్పుడూ ఆదుకుంటూనే ఉంటాడు. గతంలో ఫామ్‌లేమి కారణంగా జట్టు నుంచి అతడిని తప్పించాల్సి వచ్చిది. అయితే, ఎప్పటికప్పుడు టెక్నిక్‌ను మెరుగుపరచుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
రహానే అదే పని చేస్తున్నాడు. పునరాగమనంలో భిన్నంగా కనిపిస్తున్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తను రాణిస్తాడని అనుకుంటున్నాం. ముఖ్యంగా సౌతాఫ్రికా కండిషన్లలో ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతగానో ఉంటుంది’’ అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు.
అప్పుడు చోటే లేదు
వెటరన్ బ్యాటర్ అజింక్య రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన పలు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రహానేకు డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు వరకు జట్టులో చోటే కరువైంది.
అయితే, ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొట్టడం, అదే సమయంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో రహానే మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో స్థానం దక్కింది.
అవకాశం సద్వినియోగం చేసుకుని వైస్ కెప్టెన్‌గా
ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు రహానే. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ ఈ ముంబై బ్యాటర్ 89, 46 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికవడమే కాకుండా ఏకంగా వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
కానీ విఫలమయ్యాడు! జట్టులో చోటైతే ఖాయం
అయితే, తొలి టెస్టులో మాత్రం రహానే పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రహానేకు చోటు ఖాయమంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.
చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
SL Vs Pak: జస్ట్ 87 పరుగులతో సెంచరీ మిస్! ఆ బాధ వర్ణణాతీతం!
Comments
Please login to add a commentAdd a comment