తొలిసారిగా భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను అతడి నాయకత్వంలోని భారత జట్టు 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా గిల్‌ను నియమించింది.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి టీమిండియా వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కు బీసీసీఐ అప్పగించింది. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో గిల్ కచ్చితంగా భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో నాయకత్వం వహిస్తాడని రాథోర్ జోస్యం చెప్పాడు.
"గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్, జింబాబ్వే సిరీస్‌లో అతడు కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో గిల్ జట్టును నడిపించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తొలిసారి జాతీయ జట్టుకు నాయకత్వం వహించినప్పటకి అతడిలో కొంచెం కూడా ఒత్తడి కన్పించలేదు.
తన వ్యూహాలతో ప్రత్యర్దిని కట్టడి చేశాడు. ఇవన్నీ ఒక కెప్టెన్‌కి ఉండాల్సిన లక్షణాలే. ఇప్పుడు బీసీసీఐ అతడికి వైస్ కెప్టెన్సీ ఇచ్చి అదనపు బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా కూడా గిల్ మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. గిల్‌కు వైస్‌కెప్టెన్సీ బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారంటే అతడు ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లే.
ఇప్పుడు గిల్‌కు సీనియర్ జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం రావడంతో తన స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుంటాడని ఆశిస్తున్నాను. అతి చిన్న వయస్సులోనే గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం గొప్ప విషయం. అతడు ఏదో ఒక రోజు కచ్చితంగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు సారథ్యం వహిస్తాడని" ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment