పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న భారత అప్ కమింగ్ స్టార్ రింకూ సింగ్‌పై టీమిండియా తాజా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకూకు టెస్ట్‌ల్లో అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రింకూకు ఉన్న టెంపర్‌మెంట్ సుదీర్ఘ ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.
రింకూ నెట్స్‌లో బ్యాటింగ్ చేసే విధానం చూస్తే, అతనెందుకు టెస్ట్ జట్టులో ఉండకూడదని అనిపిస్తుందన్నాడు. రింకూ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 50కి పైగా సగటు కలిగి ఉన్నాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా వినియోగించుకుంటే రింకూ టెస్ట్‌ల్లో సత్తా చాటగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాథోడ్ రింకూపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
26 ఏళ్ల రింకూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఈ ఫార్మాట్‌లో అతను 47 మ్యాచ్‌లు ఆడి 54.70 సగటున 3173 పరుగులు చేశాడు. త్వరలో భారత్.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రింకూ సింగ్ పేరును పరిశీలిస్తారేమో చూద్దాం.
ఇదిలా ఉంటే, రింకూ.. భారత్ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన జట్టులో రిజర్వ్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టు కూర్పులో సమతుల్యత కోసం ప్రపంచకప్ జట్టుకు రింకూని ఎంపిక చేయలేదు. తాజాగా జింబాబ్వే ముగిసిన టీ20 సిరీస్‌లో రింకూ చెప్పుకోదగ్గ స్కోర్లేమీ చేయలేదు. ఈ సిరీస్‌లో అతను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 60 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా రింకూ టీ20 కెరీర్‌లో 15 ఇన్నింగ్స్‌లు ఆడి 83.2 సగటున, 176.27 స్ట్రయిక్‌రేట్‌తో 416 పరుగులు చేశాడు. రింకూ గతేడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను రెండు మ్యాచ్‌లు ఆడి 55 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment