యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా చిచ్చరపిడుగు రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అతను.. మూడింటిలో అజేయంగా (7 నాటౌట్ (2), 48 నాటౌట్ (35), 64 నాటౌట్ (35)) నిలిచి 119 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రింకూ.. తాజాగా నోయిడా సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మెవెరిక్స్ ఇన్నింగ్స్‌లో రింకూతో పాటు మాధవ్ కౌశిక్ (40) రాణించాడు. నోయిడా బౌలర్లలో నమన్ తివారి, కునాల్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా.. పియూశ్ చావ్లా, కార్తికేయ యాదవ్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు.
164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నోయిడా.. నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమితమై 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కావ్య టియోటియా (65) నోయిడాను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఆఖర్లో ఆదిత్య శర్మ (8 బంతుల్లో 21) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. నోయిడా కెప్టెన్ నితీశ్ రాణా ఓ మోస్తరు స్కోర్ (21) చేశాడు. మెవెరిక్స్ బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టాడు.
బంతితోనూ రాణించిన రింకూ..
బ్యాట్‌తో ఇరగదీసిన రింకూ సింగ్ బౌలింగ్‌లోనూ (2/18) సత్తా చాటాడు. విశాల్ చౌదరీ, యశ్ గార్గ్, జీషన్ అన్సారీ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment