బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌గా మేటి క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే, తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఈ సొగసరి బ్యాటర్ అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో లక్ష్మణ్ స్థానంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రం రాథోడ్ ఎన్‌సీఏ హెడ్‌గా రానున్నట్లు సమాచారం. బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్‌తక్ పేర్కొంది.
సంజయ్ బంగర్ స్థానాన్ని భర్తీ చేస్తూ 2019లో భారత బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు విక్రం రాథోడ్. రవి శాస్త్రి, రాహుల్ ద్రవిడ్ హయాంలో ఈ టీమిండియా బ్యాటర్ సహాయక సిబ్బందిలో ఒకడిగా కొనసాగాడు.
ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు విక్రం రాథోడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఈ ఐసీసీ టోర్నీలో భారత్ చాంపియన్‌గా నిలవడంతో వీరిద్దరు శిక్షకులుగా ఘనంగా తమ కెరీర్‌ను ముగించారు.
ఎన్‌సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్}
మరోవైపు.. 2021లో ఎన్‌సీఏ హెడ్‌గా వచ్చిన వీవీఎస్ లక్ష్మణ్ తన బాధ్యతల నుంచి ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘వీవీఎస్ లక్ష్మణ్ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధంగా లేడు.
అతడి స్థానంలో ఎన్‌సీఏ హెడ్‌గా విక్రం రాథోడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఐసీసీ వార్షిక సమావేశం ముగించుకుని బీసీసీఐ కార్యదర్శి జై షా తిరిగి వచ్చిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్‌తో మరోసారి మాట్లాడనున్నారు.
అయినప్పటికీ అతడు సుముఖంగా లేకపోతే విక్రం రాథోడ్‌కే అవకాశం దక్కనుంది’’ అని పేర్కొన్నాయి. సెప్టెంబరులో ఇందుకు సంబంధించిన ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ మెంటార్‌గా రీ ఎంట్రీ?
కాగా ఎన్‌సీఏ హెడ్‌గా రాకముందు వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా పనిచేశాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ ఐపీఎల్ ఫ్రాంఛైజీలలో ఏదో ఒకదానితో అతడు జట్టు కట్టే అవకాశం లేకపోలేదు.
ఇదిలా ఉంటే.. టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ నియమితుడైన సంగతి తెలిసిందే. అతడికి సహాయకుడిగా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రం రాథోడ్ స్థానంలో వచ్చే అవకాశం ఉంది.
చదవండి: Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
Comments
Please login to add a commentAdd a comment