ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో | unsold at IPL 2024 Auction, U-19 star claims hat trick against Afghanistan | Sakshi
Sakshi News home page

#Saumy Pandey: ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో

Published Sun, Dec 31 2023 7:46 AM | Last Updated on Sun, Dec 31 2023 10:48 AM

unsold at IPL 2024 Auction, U-19 star claims hat trick against Afghanistan - Sakshi

దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌కు టీమిండియా సన్నదమవుతోంది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు యువ భారత జట్టు దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ టీమ్స్‌తో ట్రైసిరీస్‌లో తలపడతోంది. ఈ ట్రైసిరీస్‌ కూడా సఫారీ గడ్డపైనే జరగుతుంది. ఈ ట్రైసిరీస్‌ టీమిండియా బోణీ కొట్టింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ 198 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్‌  సౌమీ పాండే 6 వికెట్లతో చెలరేగాడు. సౌమీ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి అఫ్గానిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే 6 వికెట్లు సాధించాడు. కాగా ఈ నెల 16న జరిగిన ఐపీఎల్‌ వేలంలో కూడా సౌమీ భాగమయ్యాడు.

రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్‌ సోహిల్‌ ఖాన్‌(71) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హసన్ ఈసాఖిల్(54) పరుగులతో రాణించాడు. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 4 వికెట్లు కోల్పోయి 36.4 ఓవర్లలో ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్‌ ఆదర్శ్‌ సింగ్‌(112) సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 2న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌కు గాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement