సఫారీకి అఫ్గాన్‌ షాక్‌ | Afghanistan Beat South African Hosts In ICC Under 19 World Cup | Sakshi
Sakshi News home page

సఫారీకి అఫ్గాన్‌ షాక్‌

Published Sat, Jan 18 2020 4:09 AM | Last Updated on Sat, Jan 18 2020 4:09 AM

Afghanistan Beat South African Hosts In ICC Under 19 World Cup - Sakshi

కింబర్లీ: ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు అండర్‌ –19 ప్రపంచ కప్‌ తొలి రోజు, తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ షఫీక్‌ఉల్లా గఫారీ (6/15) మాయాజాలానికి దక్షిణాఫ్రికా ఓటమి చవిచూసింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా  జరిగిన ఈ మ్యాచ్‌లో గఫారి ధాటికి దక్షిణాఫ్రికా 29.1 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 62/2తో నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన దక్షిణాఫ్రికా జట్టును గఫారీ తన లెగ్‌ బ్రేక్‌తో తిప్పేశాడు. దాంతో దక్షిణాఫ్రికా చివరి 8 వికెట్లను 67 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. అనంతరం అఫ్గాన్‌ 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి ఏడు వికెట్లతో గెలుపొందింది. ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (52; 8 ఫోర్లు), ఇమ్రాన్‌ (57; 9 ఫోర్లు) జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ అవార్డును గఫారీ అందుకున్నాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement