శ్రమించి... ఛేదించి... | India reached the final of the Under19 World Cup for the ninth time | Sakshi

శ్రమించి... ఛేదించి...

Feb 7 2024 4:00 AM | Updated on Feb 7 2024 11:30 AM

India reached the final of the Under19 World Cup for the ninth time - Sakshi

ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్‌ ఉదయ్‌ సహారణ్‌కు జతయిన సచిన్‌ దాస్‌ ఐదో వికెట్‌కు 171  పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్‌ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్‌ పోరుకు అర్హత పొందింది.   

బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్‌–19 ప్రపంచకప్‌లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌కు సెమీస్‌లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్‌ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్‌ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది.  

ప్రిటోరియస్‌ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిచర్డ్‌ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రాజ్‌ లింబాని 3; ముషీర్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉదయ్‌ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్‌ దాస్‌ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్‌) వీరోచిత పోరాటం చేశారు.  

సీన్‌ మార్చిన సచిన్‌ 
జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్‌ సింగ్‌ (0), కాసేపటికే ముషీర్‌ ఖాన్‌ (4), అర్షిన్‌ (12), ప్రియాన్షు (5) పెవిలియన్‌ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్‌ ఉదయ్‌కి సచిన్‌ దాస్‌ జతయ్యాడు. కెప్టెన్‌ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్‌ దాస్‌ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు.

అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్‌ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్‌ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్‌ రావు (10), అభిషేక్‌ మురుగన్‌ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్‌ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్‌; 1 సిక్స్, 1 ఫోర్‌) జట్టును విజయ తీరానికి చేర్చాడు.

 గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: ప్రిటోరియస్‌ (సి) అభిõÙక్‌ (బి) ముషీర్‌ 76; స్టీవ్‌ స్టోల్క్‌ (సి) అవనీశ్‌ (బి) రాజ్‌ 14; టీగెర్‌ (బి) రాజ్‌ 0; రిచర్డ్‌ (సి) మొయిలా (బి) నమన్‌ 64; ఒలీవర్‌ (సి) సచిన్‌ (బి) ముషీర్‌ 22; మరయిస్‌ (సి) అభిషేక్‌ (బి) సౌమీ పాండే 3; జేమ్స్‌ (సి) అవనీశ్‌ (బి) రాజ్‌ 24; నార్టన్‌ నాటౌట్‌ 7; ట్రిస్టన్‌ నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్‌: రాజ్‌ లింబాని 9–0–60–3, నమన్‌ తివారి 8–0–52–1, అభిõÙక్‌ మురుగన్‌ 4–0–14–0, అర్షిన్‌ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్‌ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. 
భారత్‌ ఇన్నింగ్స్‌: ఆదర్శ్‌ (సి) ప్రిటోరియస్‌ (బి) మఫక 0; అర్షిన్‌ (సి) జేమ్స్‌ (బి) ట్రిస్టన్‌ 12; ముషీర్‌ (సి) జేమ్స్‌ (బి) ట్రిస్టన్‌ 4; ఉదయ్‌ (రనౌట్‌) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్‌ (బి) ట్రిస్టన్‌ 5; సచిన్‌ (సి) టీగెర్‌ (బి) మఫక 96; అవనీశ్‌ (సి) నార్టన్‌ (బి) మఫక 10; అభిషేక్‌ (రనౌట్‌) 0; రాజ్‌ (నాటౌట్‌) 13; నమన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్‌: మఫక 10–0–32–3, ట్రిస్టన్‌ 10–1–37–3, నార్టన్‌ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్‌ 2–0–18–0, జేమ్స్‌ 8–0–44–0, వైట్‌హెడ్‌ 2–0–17–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement