World Test Championship: India Second With Win After Series Win Over Bangladesh - Sakshi
Sakshi News home page

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో భారత్‌

Published Mon, Dec 26 2022 6:14 AM | Last Updated on Mon, Dec 26 2022 8:55 AM

World Test Championship: India second with win vs Bangladesh - Sakshi

దుబాయ్‌: బంగ్లాదేశ్‌పై క్లీన్‌స్వీప్‌తో భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసులో పడింది. ఈ జాబితాలో 99 పాయింట్లున్న టీమిండియా 58.93 శాతంతో రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆస్ట్రేలియా (120 పాయింట్లు) 76.92 శాతంతో అగ్రస్థానంలో ఉంది. కానీ భారత జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో ముప్పుంది. 72 పాయింట్లున్న దక్షిణాఫ్రికా 54.55 శాతంతో మూడో స్థానంలో ఉంది.

ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. దీంతో పాటు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో   రెండు టెస్టులు కూడా దక్షిణాఫ్రికాను ఫైనల్‌ రేసులోకి తేవొచ్చు. భారత్‌కు స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ మిగిలుంది. మొత్తానికి ఈ ఎనిమిది టెస్టులే డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేస్తాయి. టాప్‌ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఏ ఢోకా లేకపోయినా... రెండో స్థానం కోసం భారత్‌కు దక్షిణాఫ్రికాతో పోటీ తప్పదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement