సరిగ్గా రెండేళ్ల క్రితం... భారత జట్టు తొలి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. 2019–21 మధ్య 12 టెస్టుల్లో విజయాలు సాధించి అద్భుత ఫామ్‌తో తుది పోరుకు అర్హత సాధించింది. అయితే అసలు సమరంలో చతికిలపడి రన్నరప్‌గా సంతృప్తి చెందింది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు న్యూజిలాండ్‌కంటే ఒక మ్యాచ్ ఎక్కువే గెలిచినా... స్లో ఓవర్ రేట్ కారణంగా నాలుగు పాయింట్లు కోల్పోయి దురదృష్టవశాత్తూ ఫైనల్ అవకాశాలు చేజార్చుకొని తీవ్ర నిరాశకు గురైంది.
ఇప్పుడు ఇరు జట్లకు తొలిసారి చాంపియన్‌గా నిలిచేందుకు మరో అవకాశం వచ్చింది. ఇటీవలే ఇరు జట్లు నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడిన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా అన్నట్లు మరో టెస్టు వచ్చేసింది. తటస్థ వేదికలో జరిగే హోరాహోరీ పోరులో ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరం.
లండన్: రోహిత్, కోహ్లి, అశ్విన్... భారత ప్రపంచకప్ విజయాల్లో భాగస్వాములు... స్మిత్, వార్నర్, స్టార్క్ కూడా అదే తరహాలో ఆసీస్ విశ్వ విజేతగా నిలిచిన జట్టులో సభ్యులు... వీరంతా పరిమిత ఓవర్ల టోరీ్నలో మాత్రమే కాకుండా టెస్టుల్లోనూ వరల్డ్ చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్న సీనియర్ ఆటగాళ్లు... పుజారా, రహానే, లయన్, ఖ్వాజా తమ టెస్టు టీమ్‌ల తరఫున చిరస్మరణీయ ప్రదర్శనలు చేసినా ఇంకా విశ్వ విజేత టీమ్ సభ్యులు అనిపించుకోని ఆటగాళ్లు... కెరీర్‌లో కనీసం 50కి పైగా టెస్టులు ఆడి, 33 ఏళ్లు దాటిన వీరందరికి టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ వేదికపై సత్తా చాటేందుకు చివరి అవకాశం.
గత రెండేళ్లుగా ప్రపంచ టెస్టు క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. గత ఫైనల్ సౌతాంప్టన్‌లో జరగ్గా, ఈసారి ఓవల్ మైదానం తుది పోరుకు వేదికైంది. ఇందులో విజేతగా నిలిచే జట్టుకు తొలిసారి డబ్ల్యూటీసీ టైటిల్ దక్కుతుంది. బలాబలాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. కెపె్టన్లు రోహిత్ శర్మ, ప్యాట్ కమిన్స్‌లకు ఇది 50వ టెస్టు కావడం విశేషం.
ఫైనల్ ‘డ్రా’ అయితే...
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ విజేత జట్టుకు వెండి గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 20 లక్షలు), రన్నరప్ జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 60 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఒకవేళ ఫైనల్ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లి, రహానే, జడేజా, భరత్/ఇషాన్‌కిషన్, అశ్విన్/శార్దుల్, షమీ, సిరాజ్, ఉమేశ్.
ఆ్రస్టేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖ్వాజా, లబుషేన్, స్మిత్, హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లయన్, బోలండ్.
పిచ్, వాతావరణం
సాధారణగా పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. అది పేసర్లకు అనుకూలం కాగా, మంచి షాట్‌లకు కూడా అవకాశం ఉంటుంది. స్వింగ్ ప్రభావం తక్కువ. నిలదొక్కుకుంటే బ్యాటర్లు చక్కగా పరుగులు రాబట్టవచ్చు. అయితే జూన్ నెలలో తొలిసారి టెస్టు జరుగుతుండటంతో ఎవరికీ పిచ్‌పై పూర్తి స్పష్టత లేదు. వర్షం ఇబ్బంది కలిగించకపోవచ్చు. రిజర్వ్ డే కూడా ఉంది.
14 ఓవల్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 14 టెస్టులు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడిపోయింది. 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
38 ఓవల్ మైదానంలో ఆ్రస్టేలియా జట్టు ఇప్పటి వరకు 38 టెస్టులు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 మ్యాచ్‌లను ‘డ్రా’గా ముగించింది.
106 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఓవరాల్‌గా 106 టెస్టులు జరిగాయి. 44 టెస్టుల్లో ఆ్రస్టేలియా... 32 టెస్టుల్లో భారత్ గెలుపొందాయి. ఒక టెస్టు ‘టై’గా ముగియగా... 29 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment