శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ అండర్-19 యూత్ జట్టు 2-0తో గెల్చుకుంది. గురువారం జరిగిన మూడో వన్డేలో లంకను యువభారత్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయింది. ఎస్ఎన్ ఖాన్ 4 కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు.
138 పరుగుల లక్ష్యాన్ని భారత్ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 32.5 ఓవర్లలో 141 పరుగులు చేసింది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో మూడు తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది.
శ్రీలంకలో వన్డే సిరిస్ గెలిచిన యువ భారత్
Published Thu, Aug 8 2013 5:31 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement