రాహుల్ ద్రవిడ్‌తో రషీద్
U 19 World Cup 2022: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరిగే అండర్– 19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఢిల్లీ బ్యాటర్ యశ్ ధుల్ నాయకత్వం వహిస్తాడు. ఆంధ్ర జట్టు బ్యాటర్, గుంటూరు జిల్లాకు చెందిన ఎస్‌కే రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో రషీద్ అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రషీద్ ఆరు మ్యాచ్‌లు ఆడి 376 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ క్రికెటర్ రిషిత్ రెడ్డి స్టాండ్‌బైగా ఉన్నాడు.
రిషిత్ రెడ్డి
భారత అండర్–19 జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), ఎస్‌కే రషీద్ (వైస్ కెప్టెన్), హర్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, నిశాంత్, సిద్ధార్థ్ యాదవ్, అనీశ్వర్ గౌతమ్, దినేశ్ బానా (వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్ (వికెట్ కీపర్), రాజ్ అంగద్, మానవ్ పరఖ్, కౌశల్ తాంబే, ఆర్‌ఎస్ హంగార్గెకర్, వాసు వత్స్, విక్కీ ఒస్త్‌వల్, రవికుమార్, గర్వ్ సాంగ్వాన్. స్టాండ్ బై: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహరన్, అన్ష్ గొసాయ్, అమృత్ రాజ్ ఉపాధ్యాయ్.
చదవండి: Yash Dhull: ఎవరీ యశ్ దుల్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేశారు!
Here's India's squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue
— BCCI (@BCCI) December 19, 2021
Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr
Comments
Please login to add a commentAdd a comment