
U19 World Cup Final- India Vs Eng: అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా భారత్, ఇంగ్లండ్ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇప్పటికే భారత్ నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగనున్న ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి ఆరంభమవుతుంది, లైవ్ టెలికాస్ట్ తదితర అంశాలు మీకోసం..
►అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్: ఫిబ్రవరి 5(శనివారం)
►వేదిక: అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం
►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆరంభం
►ప్రసారమయ్యే చానెల్: స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్
జట్లు:
భారత్:
యశ్ ధుల్(కెప్టెన్), హార్నూర్ సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్(వైస్ కెప్టెన్), నిషాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, దినేశ్ బనా(వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్(వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరేఖ్, కౌశాల్ తంబే, ఆర్‌ఎస్ హంగేర్కర్, వాసు వట్స్, విక్కీ ఒస్‌త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్.
స్టాండ్ బై ప్లేయర్లు:
రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్.
ఇంగ్లండ్:
రెహాన్ అహ్మద్, టామ్ అస్పిన్‌వాల్, సోని బేకర్, నాథన్ బర్న్‌వెల్, జార్జ్ బెల్, జాకోబ్ బెథెల్, జోష్, బోయిడెన్, జేమ్స్ కోల్స్, అలెక్స్ హార్టన్, విల్ లక్స్టన్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్), జేమ్స్ రూ, జేమ్స్ సేల్స్, ఫతేహ్ సింగ్, జార్జ్ థామస్.
రిజర్వు ప్లేయర్లు: జోష్ బేకర్, బెన్ క్లిఫ్.
చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా!
Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment