Under 19 World Cup 2021-2022: అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకుని.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టామ్ ప్రెస్ట్ సారథ్యంలోని జట్టు ఈ అద్భుతం చేసి అభిమానుల మనసులను పులకింపజేసింది.
కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ థామస్ అర్ధ సెంచరీ(50 పరుగులు)తో ఆకట్టుకోగా... జార్జ్ బెల్ 56 పరుగులు, వికెట్‌కీపర్ అలెక్స్ హార్టన్ 53 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో 15 పరుగుల తేడాతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. కాగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డీఎల్‌ఎస్ మెథడ్ ప్రకారం 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ ఆటగాడు జార్జ్ బెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
అస్సలు ఊహించలేదు..: ఇంగ్లండ్ కెప్టెన్
ఈ గెలుపును అస్సలు ఊహించలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడం కలిసి వచ్చింది. 230 పరుగులు స్కోరు చేయడం గొప్ప విషయం. ఇంగ్లండ్ ఫైనల్ చేరడం.. అందుకు నేను సారథిగా ఉండటం.. నమ్మలేకపోతున్నా.. ఎంతో సంతోషంగా ఉంది- ఇంగ్లండ్ అండర్-19 కెప్టెన్ టామ్ ప్రెస్ట్.
చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా
IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment