Antigua
-
ఇంత కథ నడిచిందా!, చోక్సీ భారత్ రాకుండా లంచాలు ఎరచూపుతున్నారా?
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్, ప్రముఖ ఎడిటర్ కెన్నెత్ రిజోక్ తెలిపారు. చోక్సీ లంచాల భాగోతంపై కెన్నెత్ రిజోక్ తన బ్లాగ్ (rijock.blogspot)లో ఓ ఆర్టికల్ ను పోస్ట్ చేశారు. ఆ న్యూస్ ఆర్టికల్‌లో కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న చోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం : సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ) అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్ పోలీస్ అధికారి ఆడోనిస్ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు ఆంటిగ్వాలో వ్యాపారం భారత్‌లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన చోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. చోక్సీకి సొంతమైన జోలీ హార్బర్ రెస్టారెంట్లో హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. చోక్సీ హెన్నీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేస్తున్నారని నివేదికలో హైలెట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం : మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్) పక్కా ఆధారాలున్నాయి క్లార్క్,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్ పోల్ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే చోక్సీని ఇండియాకు తీసుకొని రావడం కష్టతరంగా మారిందన్నారు. కిడ్నాప్ డ్రామా.. విఫలం అంటిగ్వా నుండి క్యూబాకు పారిపోవడానికి చోక్సీ కిడ్నాప్ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుండి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని చోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత్నంలో చోక్సీ .. వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు. చదవండి👉 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్ వన్! -
Under 19 WC: అఫ్గన్‌పై ఉత్కంఠ విజయం.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్లో
Under 19 World Cup 2021-2022: అండర్–19 ప్రపంచకప్ టోర్నీలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యువ ఇంగ్లండ్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకుని.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. టామ్ ప్రెస్ట్ సారథ్యంలోని జట్టు ఈ అద్భుతం చేసి అభిమానుల మనసులను పులకింపజేసింది. కాగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ థామస్ అర్ధ సెంచరీ(50 పరుగులు)తో ఆకట్టుకోగా... జార్జ్ బెల్ 56 పరుగులు, వికెట్‌కీపర్ అలెక్స్ హార్టన్ 53 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గనిస్తాన్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 15 పరుగుల తేడాతో విజయం ఇంగ్లండ్ సొంతమైంది. కాగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం 47 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ ఆటగాడు జార్జ్ బెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక బుధవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అస్సలు ఊహించలేదు..: ఇంగ్లండ్ కెప్టెన్ ఈ గెలుపును అస్సలు ఊహించలేదు. మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడం కలిసి వచ్చింది. 230 పరుగులు స్కోరు చేయడం గొప్ప విషయం. ఇంగ్లండ్ ఫైనల్ చేరడం.. అందుకు నేను సారథిగా ఉండటం.. నమ్మలేకపోతున్నా.. ఎంతో సంతోషంగా ఉంది- ఇంగ్లండ్ అండర్-19 కెప్టెన్ టామ్ ప్రెస్ట్. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: ఈ క్రికెటర్లకు భారీ డిమాండ్, రికార్డు ధర ఖాయం.. అంబటి రాయుడు, హనుమ విహారి కనీస విలువ ఎంతంటే! -
‘‘నేను స్నేహాన్ని కోరుకుంటే.. తను ఇంకేదో ఆశించేవాడు’’
-
‘‘నేను స్నేహాన్ని కోరుకుంటే.. తను ఇంకేదో ఆశించేవాడు’’
న్యూఢిల్లీ: పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందుతుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్ట్, కిడ్నాప్ డ్రామా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు బార్బరా జబారికా. మెహుల్ చోక్సీ గర్ల్ ఫ్రెండ్‌గా వెలుగులోకి వచ్చిన జబారికా ఇండియాటుడేకిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తాను చోక్సీని ఓ స్నేహితుడిగానే భావించానని.. కానీ ఆయన తన దగ్గర నుంచి వేరే ఆశించేవాడని తెలిపింది. అందులో భాగంగానే తన విమాన టిక్కెట్ల ఖర్చు భరించేవాడని.. హోటల్లో రూమ్ బుక్ చేసేవాడని తెలిపింది. ఇక తాను చోక్సీతో కలిసి కాఫీ, డిన్నర్, వాకింగ్‌కు వెళ్లానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా జబారికా మాట్లాడుతూ.. ‘‘చోక్సీ నా అపార్ట్మెంట్కి వచ్చేవాడు. నేను తనతో కేవలం స్నేహం, బిజినెస్ అంతవరకు మాత్రమే ఉండాలని భావించేదాన్ని. కానీ అతడు అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేవాడు . అందులో భాగంగా హోటల్ రూం బుకింగ్, ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేయడం వంటివి చేసేవాడు. కానీ నేను వాటన్నింటిని తిరస్కరించేదాన్ని. ఏం ఆశించి అతను ఇవన్ని చేసేవాడో నేను ఊహించగలనను. అతడు మా రిలేషన్‌ని తప్పుగా అర్థం చేసుకున్నాడు’’ అని తెలిపింది. ‘‘ఇక మే నెలలో మొత్తం పరిస్థితులు తారుమారయ్యాయి. చోక్సీ నాకు బిజినెస్ ఆఫర్స్ ఇవ్వడం ప్రారంభించాడు. నేను ప్రాపర్టీ సంబంధింత పనులు చూసుకుంటుండంతో అతడు ఆంటిగ్వాలో క్లబ్బులు, హోటళ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. వాటన్నింటికి తానే పెట్టుబడి పెడతానని తెలిపాడు. అలా వ్యాపారం మీద నాకు ఆసక్తి కలిగించాడు’’ అంటూ చెప్పుకొచ్చింది జబారికా. ‘‘ఇండియా నుంచి పారిపోయి వచ్చిన వజ్రాల వ్యాపారి చోక్సీ తనను రాజ్‌గా నాకు పరిచయం చేసుకున్నాడు.. నకిలీ వజ్రపుటుంగరాలను నాకు బహుకరించాడు. వాట్సాప్, సిగ్నల్ వంటి వేర్వేరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వేర్వేరు నంబర్ల నుంచి నాకు మెసేజ్‌లు చేసేవాడు. ఆరు నెలల్లో అతడు ఆరు నంబర్లు మార్చాడు. వాటి నుంచి మెసేజ్ చేసేవాడు. ప్రతి సారి రాజ్ అనే చెప్పుకునేవాడు. ద్వీపంలోని ప్రజలు, రెస్టారెంట్ సిబ్బంది తనను రాజ్ అనే పిలిచేవారు’’ అంటూ 33 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో బార్బరా జబారికా వెల్లడించారు. చదవండి: దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ -
దాదాపు 10 మంది నన్ను చితకబాదారు: చోక్సీ
న్యూఢిల్లీ: ఆంటిగ్వాకు చెందిన పోలీసులు తనను విచక్షణారహితంగా కొట్టినట్లు (పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రుణం ఎగవేసిన కేసులో ప్రధాన నిందితుడైన చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉన్నాడు. ఈ క్రమంలో తన సురక్షితస్థావరాన్ని వదిలి గర్ల్‌ఫ్రెండ్‌ను పొరుగునున్న డొమినికా దేశానికి డిన్నర్‌కు తీసుకెళ్లడమే మెహుల్ చోక్సీ పట్టివేతకు దారితీసింది. ఈ క్రమంలో ఆంటిగ్వాకు చెందిన సుమారు 8 నుంచి 10 మంది పోలీసులు తనను చితకబాదినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించాడు చోక్సీ. అంతేకాక తన కిడ్నాప్ వ్యవహారంలో బార్బరా జబారికాకు కూడా భాగం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చోక్సీ జూన్ 2న ఇచ్చిన 5 పేజీల ఈ ఫిర్యాదులో.. ‘‘గత ఏడాది కాలంగా నేను, జబరికా చాలా స్నేహంగా ఉన్నాము. మే 23వ తేదీన ఆమె తనను ఇంటి వద్ద పికప్ చేసుకోవాలని చెప్పింది. అక్కడకు వెళ్లిన తర్వాత 8 నుంచి పది మంది నాపై దాడి చేశారు. ఏమాత్రం జాలీ, దయ లేకుండా నన్ను విపరీతంగా కొట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జబారికా వారిని ఏమాత్రం అడ్డుకోలేదు. కనీసం మరొకరి సహాయం కూడా ఆమె కోరలేదు. జబారికా వ్యవహరించిన తీరు అనుమానం రేకిత్తిస్తుంది. నన్ను కిడ్నాప్ చేసిన వారిలో ఆమె కూడా భాగస్వామి అని డౌట్ వస్తోంది’’ అని వెల్లడించాడు చోక్సీ. ఫోన్, వాచ్, వ్యాలెట్ తీసుకుని తనపై వాళ్లు దాడి చేసినట్లు చోక్సీ తెలిపాడు. ఇక తనను కిడ్నాప్ చేసిన వారు పడవలో తీసుకెళ్లారని.. బోటు మీద 2 భారతీయులు, ముగ్గురు కరేబియన్లు ఉన్నారని వెల్లడించాడు. ఆ తర్వాత ఉన్నత స్థాయి భారతీయ రాజకీయ నాయకుడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి తనను ప్రత్యేక ప్రదేశానికి తీసుకువెళ్లారు అని చోక్సీ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఇక ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కారణంగా చోక్సీని అరెస్ట్ చేశారు. ఇక పోలీస్ స్టేషన్లో తనను ఉంచిన "హోల్డింగ్ సెల్" వద్ద ఉన్న పరిస్థితులను కూడా చోక్సీ ప్రస్తావించాడు. ‘‘నన్ను ఉంచిన గది కేవలం 20 చదరపు అడుగుల పరిమాణంలో ఉంది. దానిలో కనీసం ఓ పరుపు కూడా లేదు’’ అని తెలిపాడు. పీఎన్బీ కేసులో చోక్సీని ఇండియాకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. తనను ఎవరో అపహరించాలంటూ చోక్సీ తరపు న్యాయవాదులు పేర్కొనడంతో ఆ ఘటనపై ఆంటిగ్వా ప్రధాని విచారణకు ఆదేశించారు. చోక్సీ లాయర్లు కిడ్నాపర్ల పేర్లు పోలీసులకు చెప్పారని ప్రధాని బ్రౌనీ తెలిపారు. చదవండి: మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? -
మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే?
సాక్షి, న్యూఢిల్లీ: పీఎన్బీ కుంభకోణంలో కీలక నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని స్వదేశానికి రప్పించేందుకు మల్టీ-ఏజెన్సీ బృందం డొమినికాకు చేరుకుంది. "మిషన్ చోక్సీ" పేరుతో ఏర్పాటైన ఎనిమిది మంది సభ్యుల ఈ బృందానికి సీబీఐ అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న శారదా రౌత్ నేతృత్వం వహించడం విశేషంగా నిలిచింది. సీబీఐ, ఈడీ , సీఆర్పీఎఫ్ సభ్యులు ఈ బృందంలో భాగమని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీబీఐ బ్యాంకింగ్ మోసాలను విచారించే విభాగం చీఫ్ ముంబైకి చెందిన శారదా రౌత్ నేతృత్వంలోని ఈ బృందం రేపు (జూన్ రెండు) చోక్సీపై జరిగే కోర్టు విచారణకు హాజరవుతుంది. అక్కడ రాజకీయంగా దుమారాన్ని రేపిన ఈ కేసులో డొమినికన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహాయం చేయనుంది. అన్ని ప్లాన్ ప్రకారం జరిగితే ఒక ప్రయివేట్ విమానం ద్వారా ఈ బృందం చోక్సీని వెనక్కి తీసుకురానుందని సమాచారం. డిల్లీలో విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణమే చోక్సీని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. సీబీఐ అధికారి శారదా రౌత్ (ఫైల్ ఫోటో) ఇది ఇలాఉంటే అందరూ భావిస్తున్నట్టుగా మే 25 న కాకుండా మే 23నే మెహు్‌ల్ చోక్సీ డొమినికాకు చేరుకున్నాడని ఆంటిగ్వా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అవుట్ బౌండ్ క్లియరెన్స్ పత్రం ద్వారా తెలుస్తోంది. సెయింట్ లూసియా ఆధారిత పడవ 'కాలియోప్ ఆఫ్ ఆర్నే' ద్వారా డొమినికాలో అడుగుపెట్టాడు. అక్కడినుంచి భారత్‌తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చెక్కెయ్యాలని ప్రయత్నించి చోక్సీ చివరికి బుక్కయి పోయాడు. కాగా నకిలీ పత్రాలు, పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై వేలకోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసులో డైమండ్ కింగ్ నీరవ్ మోదీ, అతని మేనమామ మెహెల్ చోక్సీ కీలక నిందితులుగా ఉన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అతిపెద్ద కుంభకోణంగాఈ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత ఆంటిగ్వాకు పారిపోయి అక్కడి పౌరసత్వాన్ని అనుభవిస్తున్న మెహుల్ చోక్సీ ఇటీవల క్యూబాకు పారిపోతూ డొమినికాలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొమినికా పౌరసత్వంలేని చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించవచ్చని ఆంటిగ్వా ప్రకటించింది. చోక్సీ భారతదేశానికి తిరిగి వెళ్లాల్సిందే..అక్కడ నేరారోపణల విచారణను ఎదుర్కోవలసిందే అని ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధానమంత్రి గాస్టన్ బ్రౌన్ తేల్చి చెప్పారు. అలాగే చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించినందుకు చోక్సిని అదుపులోకి తీసుకోవాలని డొమినికన్ ప్రభుత్వాన్ని బ్రౌన్ కోరినట్లు ఆంటిగ్వా మీడియా వెల్లడించింది. మరోవైపు చోక్సీ భారత పౌరుడు కాదు కాబట్టి, చట్టబద్దంగా భారతదేశానికి తరలించలేరని చోక్సీ న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాదు కొన్ని రాజకీయ కారణాల రీత్యా బలవంతంగా డొమినికాకు చోక్సీని తీసుకెళ్లారని కూడా ఆరోపించారు. అటు చోక్సీ వ్యవహారం డొమినికాలో రాజకీయ వివాదానికి దారి తీసింది. అంతర్జాతీయంగా తమ ప్రతిష్ట దెబ్బదింటోందంటూ డొమినికా ప్రతిపక్ష నాయకుడు లెన్నాక్స్ లింటన్ ప్రధానమంత్రి రూజ్వెల్ట్ స్కెర్రిట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చదవండి : Mehul Choksi: గర్ల్‌ఫ్రెండ్‌తో డిన్నర్‌కు వెళ్లి చిక్కాడు కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
ఒక ఆటగాడు అలా ఔటవ్వడం ఇది ఏడోసారి
నార్త్‌సౌండ్: వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డేలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఓపెనర్ గుణతిలక అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా వెనుదిరిగాడు.నిబంధనల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ బంతిని కావాలని అడ్డుకుంటేనే దానిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌గా పరిగణిస్తారు. శ్రీలంక ఇన్నింగ్ష్ 22వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కీరన్ పొలార్డ్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని నిసాంకా ఆడి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే అతడిని వారిస్తూ ముందుకొచ్చిన గుణతిలక... వెనక్కి వెళ్లే ప్రయత్నంలో బంతిపై కాలు పెట్టాడు. అయితే పొలార్డ్ సహా ఇతర విండీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్లు గుణతిలకను అవుట్‌గా ప్రకటించారు. అయితే వీడియోలో మాత్రం గుణతిలక అసలు బంతి ఎక్కడ ఉందో చూడకుండా వెనక్కి జరగడాన్ని బట్టి చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోలేదని అర్థమవుతోంది.అయితే ఒక ఆటగాడు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వన్డేల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. ఇంతకముందు వన్డేల్లో 6 సార్లు, టెస్టుల్లో ఒకసారి.. టీ20ల్లో ఒకసారి బ్యాట్స్‌మన్ ఈ పద్దతిలో ఔటయ్యాడు.అతను కావాలని అలా చేశాడో.. లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ నిబంధనల ప్రకారం గుణతిలకను అవుట్‌గా ప్రకటించారని మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ పొలార్డ్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక (55), కరుణరత్నే (52), ఆషెన్ బండార (50) అర్ధ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జాసన్ మొహమ్మద్ 2, పొలార్డ్ , పాబియెన్ అలెన్, జోసెఫ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 47ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షై హోప్ 110 పరుగులతో ఆకట్టుకోగా.. ఎవిన్ లూయిస్ 65 అతనికి సహకరించాడు. ఈ విజయంతో విండీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మార్చి 12న జరగనుంది. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Danushka Gunathilaka has been given out Obstructing the field. Very difficult to interpret if this was a wilful obstruction. Looks unintentional but has been given out as per the lawspic.twitter.com/CJh3GmzvaN — Sarang Bhalerao (@bhaleraosarang) March 10, 2021 -
పొలార్డ్.. హ్యాట్రిక్ సంతోషం లేకుండా చేశావ్
ఆంటిగ్వా: వెస్టిండీస్, శ్రీలంక మధ్య గురువారం తొలి టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లో స్కోరింగ్ మ్యాచ్‌లో రెండు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అయితే పొలార్డ్ రికార్డు ముందు రెండో రికార్డ్ పాపులర్ అవలేదు. అసలు విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో శ్రీలంక స్పిన్నర్ అఖిల ధనుంజయ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన ధనుంజయ మూడు వరుస బంతుల్లో ఓపెనర్ ఎవిన్ లూయిస్(28 పరుగులు), క్రిస్ గేల్( 0 పరుగులు), నికోలస్ పూరన్(0 పరుగులు)లను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు. తద్వారా లంక తరపున హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్‌గా ..ఓవరాల్‌గా 13వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు లంక నుంచి లసిత్ మలింగ రెండుసార్లు(2017,2019), తిసారా పెరీరా( 2016) హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. అయితే హ్యాట్రిక్ తీసిన ఆనందం ధనుంజయకు ఎంతోసేపు నిలవలేదు. విండీస్ విధ్వంసం కీరన్ పొలార్డ్ ధనుంజయ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో క్రికెటర్‌గా.. అదే విధంగా టీ20ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో ఆటగాడిగా పొలార్డ్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విండీస్ పొలార్డ విధ్వంసంతో 13.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తద్వారా మూడు టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 5న ఆంటిగ్వా వేదికలోనే జరగనుంది. చదవండి: రెచ్చిపోయిన పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు -
కుంబ్లే... కట్టు... వికెట్టు
‘నాది ఒకటే అభ్యర్థన. దయచేసి అప్పీల్ మాత్రం చేయవద్దు’... అనిల్ కుంబ్లేకు భారత ఫిజియో ఆండ్రూ లీపస్ ఆ రోజు ఇచ్చిన సూచన ఇది. కానీ ఒక దిగ్గజ ఆటగాడిని బౌలింగ్ చేయకుండా, వికెట్ కోసం అప్పీల్ చేయకుండా ఆపడం ఆ గాయానికే సాధ్యం కాలేదు! తలకు చుట్టిన ఆ కట్టు బిగువున బాధను భరిస్తూనే అతను తనదైన శైలిలో తన పని చేసుకుంటూ పోయాడు. అలాంటి ఒక అప్పీల్‌కే ప్రత్యర్థి స్టార్ బ్యాట్స్‌మన్ లారా చిక్కాడు. తన బాధ్యత నెరవేర్చినట్లు భావించిన అనిల్ ఆ నొప్పిని మర్చిపోయాడు. కానీ నాటి అపూర్వ ప్రదర్శనను మాత్రం ఏ భారత క్రీడాభిమాని కూడా మరచిపోడు. అంకిత భావంలో, పోరాటతత్వంలో అందరికీ అందనంత ఎత్తులో ఉండే అనిల్ కుంబ్లే దానిని ఆంటిగ్వా గడ్డపై నిరూపించాడు. వెస్టిండీస్ గడ్డపై 2002లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత జట్టు పర్యటించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు చెరో టెస్టు గెలిచి 1–1తో సమంగా ఉన్నాయి. సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా)లో నాలుగో టెస్టు జరిగింది. తొలి రోజు భారత్ 226/3తో పటిష్ట స్థితిలో నిలవగా, రెండో రోజు ఆటలో వికెట్ కీపర్ అజయ్ రాత్రా కంటే ముందే ఏడో స్థానంలో అనిల్ కుంబ్లే బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు. విలవిలా... విండీస్ పేసర్ మెర్విన్ డిల్లాన్ అప్పటికే బౌన్సర్లతో జోరు మీదున్నాడు. కుంబ్లేపై కూడా అతను వచ్చీ రాగానే ఇలాగే ఒక షార్ట్ పిచ్ బంతిని సంధించాడు. తప్పించుకునే ప్రయత్నంలో కుంబ్లే తల పక్కకు తిప్పేసినా దూసుకొచ్చిన బంతి అతని దవడను బలంగా తాకింది. పదునైన పేస్ బౌలింగ్ దెబ్బకు అతని ముఖం ఒక్కసారిగా అదిరిపోయింది. ఫిజియో ఆండ్రూ లీపస్ క్రీజ్ వరకు వచ్చేలోపే క్షణాల్లో గాయం నుంచి తీవ్రంగా రక్తం కారింది. స్వల్ప చికిత్స తర్వాత మైదానం వీడాలని సహచరులు కోరినా కుంబ్లే ఒప్పుకోలేదు. తాను ప్రధాన బ్యాట్స్‌మన్ కాకపోయినా పట్టుదలగా నిలబడేందుకే సిద్ధమయ్యాడు. డిల్లాన్ ఏమీ కనికరం చూపలేదు. మళ్లీ అలాగే చెలరేగిపోయాడు. చివరకు డిల్లాన్ బౌలింగ్‌లోనే బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో చందర్‌పాల్‌కు క్యాచ్ ఇచ్చి కుంబ్లే వెనుదిరిగాడు. ఘటన జరిగిన రోజు ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయగా ఏమీ కనిపించలేదు. కానీ మరుసటి ఉదయం నొప్పి తీవ్రమైందని కుంబ్లే చెప్పడంతో మరో ఎక్స్‌రే తీశారు. అప్పుడు దవడలో పగులు వచ్చినట్లు కనిపించింది. అయితే భారత్‌లోనే సర్జరీ చేస్తే మంచిదని టీమ్ మేనేజ్మెంట్ భావించింది. దాంతో గాయంపై ఒత్తిడి పడకుండా పెద్ద బ్యాండేజీ చుట్టిన ఫిజియో లీపస్... ఎలాంటి కదలిక లేకుండా, కనీసం మాట్లాడకుండా కూర్చోవాలని చెప్పేశాడు. అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. బ్యాండేజీతో బరిలోకి... వీవీఎస్ లక్ష్మణ్ (130), అజయ్ రాత్రా (115), రాహుల్ ద్రవిడ్ (91), వసీమ్ జాఫర్ (86) రాణించడంతో... మూడో రోజు భారత్ తొమ్మిది వికెట్లకు 513 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. విండీస్ బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి పిచ్ స్పిన్‌కు కాస్త అనుకూలంగా కనిపించింది. కానీ ప్రధాన స్పిన్నర్ కుంబ్లే ఆడలేడు కాబట్టి కెప్టెన్ గంగూలీ ఏమీ చేయలేక ఇతర బౌలర్లపై ఆధారపడ్డాడు. అయితే అనూహ్యంగా కట్టుతోనే కుంబ్లే క్రీజ్‌లోకి వచ్చేందుకు సిద్ధం కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు, విశ్రాంతి తీసుకోమని కెప్టెన్ గంగూలీ చెప్పినా కుంబ్లే వినలేదు. ఇలా మధ్యలో నేను వదిలి వెళ్లలేనంటూ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. తొలి ఓవర్లోనే అతను నొప్పితో అల్లాడుతుండటం చూసిన అంపైర్ డేవిడ్ షెఫర్డ్ బౌలింగ్ చేయగలవా అంటూ మళ్లీ మళ్లీ అడిగాడు. ఆ ఓవర్ తర్వాత లీపస్ మళ్లీ వచ్చి గట్టిగా కట్టు కట్టాడు. చివరకు కుంబ్లే అదే పట్టుదలతో బౌలింగ్ చేసి అత్యంత కీలకమైన బ్రియాన్ లారా వికెట్ పడగొట్టాడు. ఆఫ్‌స్టంప్ పడి లోపలకు దూసుకొచ్చిన బంతికి లారా వికెట్ల ముందు ఎల్బీగా దొరికిపోయాడు. ఆ సమయంలో కుంబ్లేలో కనిపించిన భావోద్వేగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. వరుసగా 14 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం మూడో రోజు ఆట ముగిసింది. టెస్టు మ్యాచ్ పేలవ ‘డ్రా’గా ముగిసినా... అనిల్ కుంబ్లే పోరాటం ప్రత్యేకంగా నిలిచిపోయింది. మ్యాచ్‌ను చూస్తూ ఊరికే కూర్చోవడం నాకు బాగా అనిపించలేదు. అందుకే బరిలోకి దిగాను. జట్టు కోసం నాకు సాధ్యమైనంత రీతిలో ప్రయత్నం చేశాననే సంతృప్తితో ఇప్పుడు స్వదేశం వెళ్లగలుగుతున్నాను కదా. –కుంబ్లే వ్యాఖ్య కొసమెరుపు... కుంబ్లే లేని భారం మ్యాచ్‌పై అందరికంటే ఎక్కువగా సచిన్‌పై పడింది. అతని స్పిన్‌ను గంగూలీ నమ్ముకోవడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ ఏకంగా 34 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 200 టెస్టుల కెరీర్లో అతను ఒక మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన అత్యధిక ఓవర్లు ఇవే. మరోవైపు భారత్ తరఫున ఆడిన 11 మంది కూడా ఈ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేశారు. టెస్టు చరిత్రలో ఇలా జరగడం ఇది మూడోసారి మాత్రమే. –సాక్షి క్రీడా విభాగం -
చాలామంది కెరీర్‌ను నాశనం చేశాడు: బ్రేవో
ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి, అలాగే చాలామంది క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణం కామెరూన్ ప్రతీకార చర్యలే కారణమంటూ విమర్శించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన బ్రేవో.. కొన్ని నెలల క్రితం బోర్డుకు వచ్చిన కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్‌తోనైనా తమ క్రికెట్ మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే డేవ్ కామెరూన్ పదవీ కాల ముగిసిపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు బ్రేవో. కామెరూన్ పదవీ కాలం ముగియడంతో తమ క్రికెట్ బోర్డుక మంచి రోజులు వచ్చాయన్నాడు. సుదీర్ఘకాలం పని చేసిన కామెరూన్ నియంత పోకడలతో క్రికెట్ బోర్డును నాశనం చేశాడన్నాడు. అతని వైఖరి వల్ల పలువురు క్రికెటర్లు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారన్నాడు. 2017లో వెస్టిండీస్ తరఫున బ్రేవో చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, గతేడాది విండీస్ బోర్డు నిర్ణయాలతో విసుగు చెంది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్ రిజర్వ్ ఆటగాళ్లలో బ్రేవోకు స్థానం కల్పించడం గమనార్హం. టెస్టుల్లో 2,200 పరగులతో పాటు 86 వికెట్లు సాధించిన బ్రేవో.. వన్డేల్లో 2,968 పరుగులు సాధించడంతో పాటు 199 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 1,142 పరుగులు చేయగా 52 వికెట్లను సాధించాడు. 2014లో భారత పర్యటనలో భాగంగా విండీస్ కెప్టెన్‌గా బ్రేవో వ్యవహరించిన సమయంలోనే బోర్డుపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. జీతభత్యాల విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శించడంతో ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని విండీస్‌కు వెళ్లిపోయాడు. దాంతో ఆ పర్యటనలో భారత్-విండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. అంతకుముందు భారత్‌తో ఆ సిరీస్‌లో ఆడిన నాల్గో వన్డేనే బ్రేవోకు విండీస్ తరఫున చివరి వన్డే. -
కళ్లు చెదిరే క్యాచ్‌తో సెంచరీని అడ్డుకుంది..
ఆంటిగ్వా: వెస్టిండీస్ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు. వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేస్తే, భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌటైంది. దాంతో సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశాన్ని భారత మహిళలు తృటిలో చేజార్చుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో కెప్టెన్ స్టెఫానీ టేలర్(94; 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. ఏక్తా బిష్ వేసిన చివరి ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టిన టేలర్..ఆపై మరో బంతిని కూడా సిక్స్‌గా మలిచే యత్నం చేశారు. లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ కొట్టగా అక్కడే ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకున్నారు. గాల్లో జంప్ కొట్టిన హర్మన్ బంతిని ఒడిసి పట్టుకున్నారు. దాంతో టేలర్ సెంచరీ చేసే అవకాశాన్ని హర్మన్‌ప్రీత్ అడ్డుకోవడంతో విండీస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళల్లో టేలర్‌కు జతగా నటాషా మెక్లీన్(51; 82 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), చెడియాన్ నేషన్(43; 55 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించారు. అటు తర్వాత భారత మహిళల్లో ఓపెనర్లు ప్రియా పూనియా(75;107 బంతుల్లో 6 ఫోర్లు), రోడ్రిగ్స్( 41; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)లు శుభారంభాన్ని అందించారు. ఆపై పూనమ్ రౌత్(22), మిథాలీ రాజ్(20), హర్మన్‌ప్రీత్(5), దీప్తి శర్మ(19)లు నిరాశపరచడంతో భారత్ పోరాడి ఓడాల్సి వచ్చింది. Here u go!! Penultimate ball SIX and then Harmanpreet Stunner in last ball of the innings !!#WIWvINDW pic.twitter.com/nMoZbDPx1N — மெரின் குமார் (@merin_kumar) November 1, 201 -
కోహ్లి, రహానే చేతుల్లో...
మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది. నార్త్ సౌండ్ (అంటిగ్వా): సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) ఆ జట్టు టాప్ స్కోరర్. కెప్టెన్ హోల్డర్ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది. హోల్డర్, కమిన్స్ విసిగించారు... భారత లోయరార్డర్లో జడేజా–ఇషాంత్ తరహాలోనే విండీస్ లోయరార్డర్లో హోల్డర్, మిగుయెల్ కమిన్స్ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్ అనంతరం భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్ (24), హెట్మైర్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రోచ్ (0) పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
మనదే పైచేయి
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): వెస్టిండీస్‌పై తొలి టెస్టులో టీమిండియా క్రమంగా పట్టు బిగిస్తోంది. ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (112 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ సాయంతో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో 96.4 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటై గౌరవప్రద స్కోరు చేసిన భారత్... అనంతరం ప్రత్యర్థి టాపార్డర్‌ను పడగొట్టింది. టీ విరామ సమయానికి ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (14); క్యాంప్‌బెల్ (23)తో పాటు అరంగేట్ర బ్యాట్స్‌మన్ షమారా బ్రూక్స్ (11) వికెట్లు కోల్పోయిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 82 పరుగులు చేసింది. చేతిలో ఏడు వికెట్లుండగా ఆ జట్టు మరో 215 పరుగులు వెనుకబడి ఉంది. షమీ, ఇషాంత్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఇన్నింగ్స్‌లో రహానే (81; 10 ఫోర్లు) టాప్ స్కోరర్. గురువారం ఆంధ్ర క్రికెటర్ విహారి (32; 5 ఫోర్లు)తో కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలిపిన అతడు సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. ఐదో వికెట్‌కు వీరు 82 పరుగులు జత చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 68.5 ఓవర్ల వద్దే ముగించారు. ఓవర్‌నైట్ స్కోరు 203/6తో శుక్రవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... పంత్ (24) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. 207/7తో ఉన్న ఈ దశలో జట్టు 250 దాటడమే గగనం అనిపించింది. కానీ, జడేజా, ఇషాంత్ (62 బంతుల్లో 19) 8వ వికెట్‌కు 60 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు: భారత తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) హోప్ (బి) చేజ్ 44; మయాంక్ (సి) హోప్ (బి) రోచ్ 5; పుజారా (సి) హోప్ (బి) రోచ్ 2; కోహ్లి (సి) బ్రూక్స్ (బి) గాబ్రియెల్ 9; రహానే (బి) గాబ్రియెల్ 81; విహారి (సి) హోప్ (బి) రోచ్ 32; పంత్ (సి) హోల్డర్ (బి) రోచ్ 24; జడేజా (సి) హోప్ (బి) హోల్డర్ 58; ఇషాంత్ (బి) గాబ్రియెల్ 19; షమీ (సి అండ్ బి) చేజ్ 0; బుమ్రా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (96.4 ఓవర్లలో ఆలౌట్) 297. వికెట్ల పతనం: 1–5, 2–7, 3–25, 4–93, 5–175, 6–189, 7–207, 8–267, 9–268, 10–297. బౌలింగ్: రోచ్ 25–6–66–4; గాబ్రియెల్ 22–5–71–3; హోల్డర్ 20.4–11–36–1; కమిన్స్ 13–1–49–0; చేజ్ 16–3–58–2. -
మెహుల్ చోక్సీకి ఎదురు దెబ్బ
ఆంటిగ్వా/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14వేలకోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంటిగ్వా ప్రభుత్వం అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపరమైన ప్రక్రియ ముగిశాక భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది. న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోతే భారత్‌కు పంపిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే చెప్పారు. చోక్సీ బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టాక కరేబియన్ దీవులకు పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు. పీఎన్బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ గత ఏడాది జనవరిలో పరారయ్యాడు. అంతకు ముందే 2017 నవంబర్‌లో సిటిజెన్షిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ (సీఐపీ) కింద ఆంటిగ్వా, బార్బడా జంట దీవుల పౌరసత్వాన్ని తీసుకున్నాడు. కాగా, లక్ష అమెరికా డాలర్లను ఇన్వెస్ట్ చేసి ఆంటిగ్వా, బార్బడా పౌరసత్వాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మరోవైపు చోక్సీ తానేమీ పారిపోలేదని, వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు వచ్చానని ట్రీట్మెంట్ అయిపోగానే భారత్‌కు వస్తానని అతని కేసు విచారిస్తున్న బాంబే హైకోర్టుకు వెల్లడించాడు. గీతాంజలి జెమ్స్ కంపెనీకి చెందిన వజ్రాల వ్యాపారులైన చోక్సీ, నీరవ్ మోదీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ లండన్ జైల్లో ఉన్నాడు. వారిద్దరినీ తిరిగి భారత్‌కు తీసుకురావడానికి ఈడీ, సీబీఐ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. -
మెహుల్ చోక్సీకి షాక్
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన డైమండ్ వ్యాపారి, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ 14,000 కోట్లకు పైగా పీఎన్బీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అంటిగ్వా ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్‌కు అప్పగించే ప్రక్రియ చేపడతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రుణ కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటూ దేశం విడిచి అంటిగ్వాలో తలదాచుకున్న చోక్సీ అప్పగింత ప్రక్రియ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది. చోక్సీ తన వాదనను సమర్ధించుకోవడంలో విఫలమై, న్యాయ ప్రక్రియలో చేతులెత్తేసిన అనంతరం ఆయనను అప్పగిస్తామని హామీ ఇస్తున్నామని అంటిగ్వా ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీని అప్పగించాలన్న భారత్ పిటిషన్‌ను బ్రిటన్ కోర్టులో ఎదుర్కొంటున్నారు. నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్లను బ్రిటన్ కోర్టులు పలుమార్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
-
భారత పౌరసత్వం వదులుకున్న చోక్సీ
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో తలదాచుకున్న రుణ ఎగవేతదారులను భారత్‌కు రప్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండిపడింది. పీఎన్బీ స్కామ్‌లో నిందితుడు, పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ తన భారత పౌరసత్వాన్ని వదులుకుని అంటిగ్వా ప్రభుత్వానికి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు.చోక్సీ ఏడాదికి పైగా అంటిగ్వాలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. రుణ ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తాను భారత్ వెళ్లేందుకు తన ఆరోగ్యం సహకరించదని 2018 డిసెంబర్ 25న చోక్సీ న్యాయస్ధానం ఎదుట తన వాదనను వినిపించారు. అంటిగ్వా నుంచి భారత్‌కు 41 గంటల పాటు ప్రయాణం చేసే పరిస్ధితిలో తాను లేనని కోర్టుకు వివరించారు. తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి డైమండ్ వ్యాపారి చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ 13,000 కోట్లకు మోసం చేసినట్టు దర్యాప్తు సంస్ధలు ఆయనపై విచారణ చేపట్టాయి. కాగా భారత పౌరసత్వం వదులుకోవడం ద్వారా భారత చట్టాల ప్రకారం తనపై జరిగే విచారణను అడ్డుకునేందుకు చోక్సీ ఇలా వ్యవహరించారని భావిస్తున్నారు. -
చోక్సీని వెనక్కు పంపండి: భారత్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లకు మోసగించి ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న మెహుల్ చోక్సీని వెనక్కు పంపాలని ఆ ప్రభుత్వాన్ని భారత్ అభ్యర్థించింది. చోక్సీని తిరిగి తీసుకొచ్చే విషయమై ఆంటిగ్వా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత్ నుంచి ఓ బృందం కొన్ని రోజుల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెప్పాయి. భారత బృందం ఆంటిగ్వా విదేశాంగ శాఖను శనివారం కలిసి, చోక్సీని భారత్‌కు తిప్పి పంపాలని అభ్యర్థించినట్లు ఓ అధికారి వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని బంధువైన చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12 వేల కోట్ల మేర మోసగించి దేశం నుంచి పారిపోవడం తెలిసిందే. -
కేసుల ఎఫెక్ట్.. పౌరసత్వాన్ని కొనేశాడు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి కరీబియన్ ఐలాండ్ ఆంటిగ్వా పౌరసత్వం లభించింది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయిన చోక్సీ ముందుగా ఆంటిగ్వా శరణుకోరారు. ఆ తర్వాత పౌరసత్వాన్నే కొనుక్కున్నారు. ఇక్కడ పౌరసత్వం కొనుక్కోవడం అంటే ఆ దేశంలో వ్యాపారం పేరిట కొంత నిర్ణీత సొమ్మును పెట్టుబడిగా పెట్టడం. ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల పౌరసత్వాన్ని పెట్టుబడుల రూపంలో కొనుక్కునే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల పౌరసత్వం కావాలంటే కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. కరీబియన్ ఐలాండ్‌లో చాలా సులభంగా పౌరసత్వాన్ని కొనుక్కోవచ్చు. ఆంటిగ్వా, బార్బుడా లాంటి కరీబియన్ దేశాల్లో 25 వేల అమెరికా డాలర్లను పెట్టుబడిగా పెట్టి, ఐదేళ్ల కాలంలో ఐదు రోజులుంటే తక్షణమే పౌరసత్వం, పాస్‌పోర్టు అభిస్తుంది. అదే ఆస్ట్రేలియాలో పౌరసత్వం రావాలంటే 50 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టి ఏడాదికి 40 రోజులు నివాసం ఉంటే ఐదేళ్లకాలానికి పౌరసత్వం, పాస్‌పోర్టు లభిస్తుంది. అదే కెనెడా దేశంలో ఐదు లక్షల కెనడా డాలర్లను పెట్టుబడులుగా పెడితే ఐదేళ్ల కాలానికి 730 రోజులు నివాసం ఉంటే మూడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. ఇక అమెరికాలో ఐదు లక్షల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి ఏడాదికి 180 రోజులు నివాసం ఉంటే ఏడేళ్ల కాలానికి పౌరసత్వం లభిస్తుంది. -
ఇండియానే క్లీన్ చిట్ ఇచ్చింది
న్యూఢిల్లీ: తాము విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీకి భారత్ క్లీన్ చిట్ ఇచ్చిందని, ఆ తరువాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని ఆంటిగ్వా ప్రభుత్వం వెల్లడించింది. చోక్సీకి పౌరసత్వం మంజూరు చేయడంలో తామేమీ తప్పు చేయలేదని స్పష్టం చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ వాంటెడ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2017 మేలో పౌరసత్వం కోసం చోక్సీ దరఖాస్తు చేసుకోగా, భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) క్లీన్ చిట్ ఇచ్చాయని ఆంటిగ్వా ప్రభుత్వం పేర్కొంది. తర్వాతే చోక్సీకి పౌరసత్వం ఇచ్చామని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో మోదీ ప్రభుత్వ తీరు తేటతెల్లమవుతోందని కాంగ్రెస్ విమర్శించింది. అసలేం జరిగింది... ఆంటిగ్వా అండ్ బార్బుడా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్మెంట్ యూనిట్ (సీఐయూ) చోక్సీకి సంబంధించి స్థానిక మీడియాకు విడుదల చేసిన సుదీర్ఘ ప్రకటనలో పలు వివరాలు వెల్లడించింది. ‘2018 జనవరి మొదటి వారంలో చోక్సీ భారత్‌ను వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 2017 మేలో చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పలు విచారణలు చేసి అన్నింటిలో క్లీన్ చిట్ వచ్చాకే కిందటేడాది నవంబర్‌లో దాన్ని ఓకే చేశాము. ఇందుకోసం ఆయన ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద రూ.1.3 కోట్లు చెల్లించారు. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15న ఆయన ఆంటిగ్వా పౌరుడిగా విధేయతా ప్రమాణం చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత అంటే జనవరి 29న కేంద్ర నేర పరిశోధన సంస్థ (సీబీఐ) నీరవ్ మోదీ, చోక్సీపై కేసులు నమోదు చేసి, విచారణ ప్రారంభించింది. చోక్సీ ప్రస్తుతం మా దేశ పౌరుడు కనుక ఆయనను దేశం నుంచి పంపించలేం’ అని వివరించింది. ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయడంలో పొరపాటు జరగలేదని పేర్కొంది. ఆయనకు మంజూరు చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే చట్టబద్ధమైన ప్రక్రియను చేపట్టవలసి ఉంటుందని, ఆయన ప్రస్తుతం ఆంటిగ్వా చట్టాల రక్షణలో ఉన్నారని తెలిపింది. ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనే మాట్లాడుతూ తన చేతులు కట్టేసి ఉన్నాయన్నారు. చోక్సీకి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? చోక్సీపై పలు ఫిర్యాదులుండగా విదేశీ వ్యవహారాల శాఖ క్లీన్ చిట్ ఎలా ఇచ్చిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ ఉదంతం దోపిడీదారుల పట్ల మోదీ ప్రభుత్వ తీరును తేటతెల్లం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనేని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. అప్పట్లో కేసుల్లేవు కాబట్టే పీసీసీ ఇచ్చాం ఆంటిగ్వా ప్రభుత్వం విచారణ చేసినప్పుడు మెహుల్ చోక్సీపై కేసులేం లేవని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముంబై పాస్‌పోర్టు కార్యాలయం అప్పటి పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు (పీవీఆర్)ను అనుసరించి 2016 మార్చి 16న చోక్సీకి క్లీన్ చిట్ ఇచ్చిందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అప్పటికి అతనిపై కేసులేం లేనందున అతనికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) ఇచ్చారని తెలిపారు. చోక్సీకి సంబంధించి తామేం క్లీన్ చిట్ ఇవ్వలేదని, అసలు ఆంటిగ్వా నుంచి తమకు ఎలాంటి అభ్యర్థనా రాలేదని, తాము వారికి ఏ సమాచారం ఇవ్వలేదని సెబీ తెలిపింది. -
నేను పారిపోలేదు -మెహుల్ చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాంలో కీలక నిందితుడైన గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ ఆటింగ్వాలో దాక్కున్నాడన్న వార్తలపై స్పందించారు. తాను న్యాయబద్ధంగానే ఆటింగ్వాలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గత ఏడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు చోక్సీ న్యాయవాది డేవిడ్ డోర్సెట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 132 దేశాల్లో వీసా రహిత ప్రయాణానికి కరేబియన్ దేశం అనుమతించినట్టు తెలిపింది. ఇందులో భారత ప్రభుత్వ ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని చోక్సీ వాదించారు. . ఆంటిగ్వా వార్తాపత్రిక డైలీ అబ్జర్వర్ కథనం ప్రకారం ఈ ఏడాది నవంబరు 2017లో పౌరసత్వం రాగా, జనవరి 15 న చెక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాగే వైద్య చికిత్సల నిమిత్తం చోక్సీ 2018 జనవరిలో నుంచి అమెరికాకు వెళ్లానన్నారు. ఇంకా కోలుకుంటున్న నేపథ్యంలో ఆటింగ్వా,బార్బుడాలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. కాగా పీఎన్బీ స్కాంలో వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు ఉడాయించిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నారని, ఆ దేశం పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడన్న సమాచారంపై సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. ఆయన ఆచూకీ చెప్పాలని ఆంటిగ్వా అధికారులకు లేఖ రాసింది. ఈనెలలోనే చోక్సీ ఆమెరికా నుంచి ఆంటిగ్వాకు వెళ్లిపోయి, అక్కడి పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారని ఆంటిగ్వా అధికారులు ధ్రువీకరించిన విషయం బయటకు రావడంతో సీబీఐ తాజాగా లేఖ రాసింది. చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును దృష్టిలో ఉంచుకుని ఆయన కదలికలు, ప్రస్తుతం ఉంటున్న ప్రాంత వంటి వివరాలు తమకు తెలియజేయాల్సిందిగా సీబీఐ ఆ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు 2017లో దాదాపు 28 మంది భారతీయులు ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఆంటిగ్వాలో మెహుల్ చోక్సీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కరీబియన్ దేశం ఆంటిగ్వాకు వెళ్లినట్లు తెలిసింది. అమెరికా నుంచి ఆంటిగ్వా వెళ్లి ఆయన అక్కడి పాస్‌పోర్టును కూడా సంపాదించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇంటర్‌పోల్ నోటీసులకు స్పందించిన ఆంటిగ్వా అధికారులు.. ఈ సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అందజేశారు. ఈ నెలలోనే చోక్సీ ఆంటిగ్వా చేరుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడటానికి 15 రోజుల ముందు చోక్సీ దేశం విడిచివెళ్లాడు. -
'అన్ని గెలిస్తే సంతోషమే కదా'
ఆంటిగ్వా: విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నామని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. వరుస విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో చారిత్రక విజయం సాధించింది. 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్ తొలిసారి ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.... ప్రతి మ్యాచ్ తమకు కొత్తదేనని అన్నాడు. ఒక మ్యాచ్ కు మరో మ్యాచ్ కు సంబంధమే ఉండదని పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అన్ని మ్యాచ్ లు గెలిస్తే సంతోషమే కదా అని కోహ్లి వ్యాఖ్యానించాడు.