పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) స్కాంలో కీలక నిందితుడైన గీతాంజలి సంస్థల అధిపతి మెహుల్ చోక్సీ ఆటింగ్వాలో దాక్కున్నాడన్న వార్తలపై స్పందించారు. తాను న్యాయబద్ధంగానే ఆటింగ్వాలో ఉంటున్నట్టు స్పష్టం చేశారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గత ఏడాది ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నానని ప్రకటించారు. ఈ మేరకు చోక్సీ న్యాయవాది డేవిడ్ డోర్సెట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 132 దేశాల్లో వీసా రహిత ప్రయాణానికి కరేబియన్ దేశం అనుమతించినట్టు తెలిపింది. ఇందులో భారత ప్రభుత్వ ఆరోపణలపై ఎటువంటి వాస్తవం లేదని చోక్సీ వాదించారు. . ఆంటిగ్వా వార్తాపత్రిక డైలీ అబ్జర్వర్ కథనం ప్రకారం ఈ ఏడాది నవంబరు 2017లో పౌరసత్వం రాగా, జనవరి 15 న చెక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని స్వీకరించారు. అలాగే వైద్య చికిత్సల నిమిత్తం చోక్సీ 2018 జనవరిలో నుంచి అమెరికాకు వెళ్లానన్నారు. ఇంకా కోలుకుంటున్న నేపథ్యంలో ఆటింగ్వా,బార్బుడాలో ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.
కాగా పీఎన్‌బీ స్కాంలో వేలకోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు ఉడాయించిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్నారని, ఆ దేశం పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడన్న సమాచారంపై సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. ఆయన ఆచూకీ చెప్పాలని ఆంటిగ్వా అధికారులకు లేఖ రాసింది. ఈనెలలోనే చోక్సీ ఆమెరికా నుంచి ఆంటిగ్వాకు వెళ్లిపోయి, అక్కడి పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నారని ఆంటిగ్వా అధికారులు ధ్రువీకరించిన విషయం బయటకు రావడంతో సీబీఐ తాజాగా లేఖ రాసింది. చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసును దృష్టిలో ఉంచుకుని ఆయన కదలికలు, ప్రస్తుతం ఉంటున్న ప్రాంత వంటి వివరాలు తమకు తెలియజేయాల్సిందిగా సీబీఐ ఆ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు 2017లో దాదాపు 28 మంది భారతీయులు ఆటింగ్వా పౌరసత్వం తీసుకున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment