'అన్ని గెలిస్తే సంతోషమే కదా' | We want to create winning habits, winning is contagious: Virat Kohli | Sakshi
Sakshi News home page

'అన్ని గెలిస్తే సంతోషమే కదా'

Published Mon, Jul 25 2016 8:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

'అన్ని గెలిస్తే సంతోషమే కదా'

'అన్ని గెలిస్తే సంతోషమే కదా'

ఆంటిగ్వా: విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకోవాలనుకుంటున్నామని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. వరుస విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో  చారిత్రక విజయం సాధించింది. 63 ఏళ్లుగా వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత్‌ తొలిసారి ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును ఇన్నింగ్స్‌ 92 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.... ప్రతి మ్యాచ్ తమకు కొత్తదేనని అన్నాడు. ఒక మ్యాచ్ కు మరో మ్యాచ్ కు సంబంధమే ఉండదని పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ ల్లో గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అన్ని మ్యాచ్ లు గెలిస్తే సంతోషమే కదా అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement